అమెరికాలో విదేశీ విధాన మ్యాగజిన్ లో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించడంపై ఒక విశ్లేషనాత్మక కధనాన్ని ప్రచురించింది.ప్రియాంక భాద్యతలని ఎప్పుడైతే స్వీకరించిందో ఆ పార్టీ ఆర్థిక వనరులు వృద్ధి చెందుతాయని అమెరికాకు చెందిన ఫారిన్ పాలసీ మ్యాగజైన్ పేర్కొంది.
బీజేపీ తో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి ఆర్ధిక వనరులు తక్కువగా ఉన్నాయని లెక్కలు కూడా కట్టింది.
అయితే ప్రియాంక గాంధీ పార్టీలోకి రావడం వలన విజయం వరిస్తుండా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని తెలిపింది.ఈ మేరకు కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ప్రతినిధి మిలాన్ వైష్ణవ్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్‌లో ఒక వ్యాసం రాశారు.2014లో ఎంతో ఘోరమైన వైఫల్యాని అందుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత భారీగా ఏర్పడిందని.
ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లోకి ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీ కి నైతిక బలం వచ్చిందని ఆమె తెలిపారు.సోషల్ మీడియాలో బీజేపీ ఆమెపై ఆధిపత్యం చేస్తుందని ఈ మ్యాగజైన లో తెలిపారు.సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీ కి ఉన్న మీడియా దృష్టిని సైతం ఆమె ఆకర్షించుకోగలదని మిలాన్ వైష్ణవ్ విశ్లేషించారు.