కమలా హారీస్ మీడియా కార్యదర్శిగా ఇండో అమెరికన్ ..!!

అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు హోరా హోరా పోటీ పడుతున్నారు.కమలా హారీస్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక కావడంతో ఆమె మరింత దూకుడు పెంచారు.

 Senator Kamala Harris Appoints Indian-american Sabrina Singh As Her Press Secret-TeluguStop.com

అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ట్రంప్ పై అస్త్రంగా వదిలిన కమలా హారీస్ అందుకు తగ్గట్టుగానే వాడి వేడి మాటలతో ట్రంప్ ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు.ట్రంప్ ఓ అసమర్ధుడు ,ఇలాంటి అధ్యక్ష్యుడు మనకి కావాలా అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలకి అమెరికన్స్ నుంచీ వస్తున్న స్పందన చూస్తుంటే ట్రంప్ చీటీ చిరిగిపోయినట్టేనని అనుకోవాల్సిందే.ఇదిలాఉంటే

కమలా హరీస్ తన ప్రచారంలో వేగాన్ని మరింత పెంచారు.ఎన్నికలు ఎంతో దూరంలో లేకపోవడంతో దూకుడు పెంచిన మీడియా కార్యదర్శిగా ఇండో అమెరికన్ అయిన సబ్రినా సింగ్ కి కీలక భాద్యతలు అప్పగించారు.

సబ్రినా గతంలో ఇద్దరు ప్రెసిడెన్షియాల్ అభ్యర్ధుల వద్ద అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమెకి కమలా హారీస్ ఈ భాద్యతలు అప్పగించారని తెలుస్తోంది.న్యూజెర్సీ సెనేటర్ బుకర్, న్యూయార్క్ మాజీ మేయర్ బ్లూమింగ్ వద్ద సబ్రినా పనిచేశారు…అయితే

Telugu Donald Trump, Joe Biden, Kamala Harris, Sabrina Singh, Kamalaharris-

కమలా సబ్రినా ని ఎంపిక చేయడం వెనుక కూడా రాజకీయపరమైన కారణాలు లేకపోలేదు.సబ్రినా సింగ్ సిక్కు సంతతికి చెందిన మహిళ కావడమే అందుకు కారణమని తెలుస్తోంది.ఎందుకంటే అమెరికా భారతీయులలో అత్యధిక శాతం సిక్కు ప్రజలు కొలువు దీరి ఉన్నారు.

కొన్ని ప్రాంతాలలో మెజారిటీ ఓట్లు వారివి కావడంతో కమలా హారీస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కూడా తెలుస్తోంది.ఏది ఏమైనా ఇటు భారతీయ అమెరికన్స్ మద్దతు అటు ఆఫ్రికా అమెరికన్స్ మద్దతు కమలాకి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube