అలనాటి హీరోయిన్ రాధ ( Radha ) ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.80 స్ లో అగ్రతార గా వెలిగిన ఈ హీరోయిన్ వందల కొద్ది సినిమాల్లో నటించింది.అలా తెలుగు,తమిళ భాషల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధ ఈ మధ్యనే తన పెద్ద కూతురు కార్తిక ( Karthika ) కి పెళ్లి చేసింది.ఇక కార్తీక కూడా అందరికీ సుపరిచితమైన హీరోయినే.
ఈమె నాగచైతన్య మొదటి సినిమా అయినా జోష్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఇక ఈ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన రంగం మూవీ ద్వారా ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది.
ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఆఫర్ కొట్టేయడంతో ఈమె సినీ గ్రాఫ్ పెరుగుతుంది అని అందరూ భావించారు.కానీ దమ్ము సినిమా డిజాస్టర్ అవడంతో కార్తిక కు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి.

ఇక తెలుగులో ఆఫర్లు రాకపోయినా కూడా తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో బిజీ అవ్వాలి అనుకున్నప్పటికీ అక్కడ కూడా ఈమె నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ తనకి సెట్ అవ్వదని బిజినెస్ ఉమెన్ గా స్థిరపడాలి అని తమకి ఉన్న రెస్టారెంట్ పనులు చూసుకోవడంలో బిజీ అయిపోయింది.ఇక హీరోయిన్ రాధకి ముంబై,చెన్నై అలాగే దుబాయి ( Dubai ) లో కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి.అలా దుబాయ్ లో ఉన్న ఒక రెస్టారెంట్ బాధ్యతను కార్తీకకి అప్పగించిందట.ఇక 2021 నుండి కార్తీకకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారట ఇంట్లోవాళ్ళు.

అలా మలయాళీ ఫ్యామిలీకి చెందిన యువ వ్యాపారవేత్త అయిన రోహిత్ మీనన్ ( Rohith menon ) సంబంధం కార్తీకకు రావడంతో వారి బ్యాగ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసుకొని రాధా రాజశేఖరన్ ఇద్దరు కూతురికి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.ఇక రాధా తన కూతురు పెళ్లిని కేరళలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా చేసింది.ఇక వీరి పెళ్లికి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు హాజరయ్యారు.ఇక ఈ పెళ్లిలో కార్తీక వేసుకున్న నగలు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.పెళ్లికూతురు కంటే ఎక్కువగా పెళ్లికూతురు నగల మీదే అందరి దృష్టిపడింది.ఇక రాధా తన కూతురికి ఎంత కట్నం ఇచ్చిందో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
ఇక రాధ తన కూతురు కార్తికకి 35 కోట్ల విలువచేసే బంగారంతో పాటు దుబాయ్ లో కార్తిక చూసుకున్న రెస్టారెంట్ ని కూడా తన పేరు మీదే రాసిచ్చిందట.అలాగే 8 కోట్ల విలువ చేసే ఖరీదైన కారును కూడా తన అల్లుడికి కట్నం గా ఇచ్చినట్టు తెలుస్తుంది.
అలాగే కార్తిక ( Karthika ) హీరోయిన్ గా చేసిన సమయంలో ఆమెకి వచ్చిన రెమ్యూనరేషన్ తో కొన్న ఆస్తిపాస్తులను కూడా కార్తికకే ఇచ్చేసారట.