ఏపీలో పొత్తుల విషయంలో కొత్త మలుపు తిరుగుతోంది.ఎప్పటి నుంచే పొత్తులు ఉంటాయని అనుకున్నప్పటికీ ఎన్నికల నాటికి ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.
అయితే జనసేన అధినేత పొత్తులకు ఆస్తకి చూపుతుండంగా ఇటు బీజేపీ టీడీపీతో కలిపి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే జరిగితే టీడీపీ, జనసేన.
.బీజేపీ పొత్తు కుదిరితే ఇందులో జనసేనకే షాక్ తగిలేలా ఉంది.సీట్లు తగ్గించుకునే దిశగా తగ్గాల్సి ఉంటుంది.ఎందుకంటే పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పారు గనక.అయితే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అధికారం షేరింగ్.పెద్దన్న పాత్ర పోషించాలని అనుకున్నారు.
కానీ బీజేపీ ఎంట్రీతో సీన్ మారేలా ఉంది.ఇక అయితే మరో కొత్త పొత్తు దిశగా ఇపుడు ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి.
ప్రస్తుతం బీజేపీ కరుణాకటాక్ష వీక్షణాలు టీడీపీ మీద ప్రసరిస్తున్నాయి.దీంతో చంద్రబాబు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీతో నాలుగేళ్ల తర్వాత దగ్గరవుతున్న బాబు ఏపీ సీఎం తనేనని ధీమాగా కూడా ఉన్నారు.అయితే ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో పొత్తు ఈసారి కుదరవచ్చు కానీ సీట్ల దగ్గర పంచాయతీ మాత్రం అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదంటున్నారు రాజకీయ పండితులు.
బీజేపీ ప్రస్తుతం దూకుడు మీద ఉంది.తెలంగాణలో పవర్ మాదే అంటోంది.తెలంగాణాలో 2023లో ఎన్నికలు జరుగనుండగా అక్కడ కచ్చితంగా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక బీజేపీ చెప్పినట్లుగానే బాబు వినాల్సి ఉంటుంది.
అలా కాకుండా సెకండ్ ప్లేస్ కి వచ్చినా కూడా ఏపీ మీదనే ప్రభావం చూపిస్తుంది అనే చెప్పాలి.ఈ వంకతోనే ఏపీలో సీట్ల డిమాండ్ కి తెరలేపుతుంది.
ఇక ఎలాగూ తెలంగాణలో జరిగిన తర్వాతే ఏపీలో జరుగుతాయి.కాబట్టి తెలంగాణలో గెలుపును చూపించుకుని ఏపీలో బీజేపీ తన ప్రతాపం చూపించడానికి ప్రయత్నిస్తుంది.
అయితే కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు ఒక సీటు వంతున అడగాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారట.తెలంగాణలో పవర్ కనుక వస్తే ఆ లెక్క డబుల్ అవుతుందని అంటున్నారు.

చంద్రబాబుతో బీజేపీ పొత్తు కావాల్సి వస్తే ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే అని పేచీకి దిగితే బాబుకు అది రాజకీయ గండమే అంటున్నారు.ఇక బీజేపీ పొత్తు జనసేన సీట్లకు కూడా బ్రేక్ వేస్తుందని అంటున్నారు.ఇపుడున్న పరిస్థితుల్లో జనసేన టీడీపీని 75 సీట్ల దాకా బేరం పెడుతోందని టాక్.అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీకి త్యాగం చేయదు కాబట్టి నలభై.ఆలోపు ఫిక్స్ చేస్తారు.ఇక ఇప్పుడు బీజేపీ కూడా మధ్యలోకి వస్తే పవన్ సీట్లకు భారీ కోత పడుతుందని అంటున్నారు.
బీజేపీ పాతిక సీట్లు డిమాండ్ చేస్తే జనసేనకు ఏ ముప్పయి సీట్లకో కథ ముగుస్తుందని అంటున్నారు.ఇక తీసుకుంటుంది బీజేపీ కాబట్టి జనసేన కూడా చేసేది ఏమిలేక కలిసి రావాల్సిందే అంటున్నారు.
ఈ లెక్కన చూస్తే జనసేన పవర్ షేరింగ్ తో మొదలు పెట్టి సీట్లకు కొత తప్పదనే పరిస్థితిలో ఉందని అంటున్నారు.
.