బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.హైపర్ ఆది ఏ స్కిట్ చేసినా ఆ స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
యూట్యూబ్ లో హైపర్ ఆది స్కిట్లకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.జబర్దస్త్ లో భారీస్థాయిలో పేమెంట్ తీసుకుంటున్న అతికొద్ది మంది కమెడియన్లలో హైపర్ ఆది కూడా ఒకరు కావడం గమనార్హం.
హైపర్ ఆది ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేయడంతో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు.ఈ షోలతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే ఈవెంట్లలో కూడా హైపర్ ఆది సందడి చేస్తారనే సంగతి తెలిసిందే.
దీపావళి పండుగ కానుకగా ఈటీవీ ఛానల్ లో ఇది కదా పండగంటే పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుంది.పోసాని కృష్ణమురళిని ఆది వీళ్లలో ఎవరంటే ఇష్టం అని అడగగా నరేష్ అంటే ఇష్టమని చెబుతాడు.
నరేష్ అంటే ఎందుకు ఇష్టమని ఆది అడగగా ఇతని పెళ్లి జరిగితే నాకు పెద్ద పండుగ అని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.నా పెళ్లి జరిగితే మీకు పండుగ ఏంటని నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం.
ఆ తర్వాత సంగీత ఎంట్రీ ఇవ్వగా గీత ఒక్క ఛాన్స్ అని ఆది అడుగుతాడు.
దేనికి అని సంగీత అడగగా దేనికైనా అని ఆది సమాధానం ఇస్తాడు.ఆ తర్వాత ఆది, పోసాని టెంపర్ స్పూఫ్ స్కిట్ చేశారు.ఆ అమ్మాయిని ఏడిపించింది ఐదుగురు అని ఐదోవాడు పోసాని అంటూ ఆది వేసిన పంచ్ లు నవ్వులు పూయించాయి.
హైపర్ అది తల్లి వీడియో ద్వారా మాట్లాడుతూ ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు నాకు అక్కడికి రావాలని ఉందని కానీ మోకాళ్ల నొప్పుల వల్ల ఎక్కువ సమయం నిలబడలేనని ఆమె అన్నారు.ఆ తర్వాత ఆది మా అమ్మంటే నాకు చాలాచాలా ఇష్టం అని ఆ సిచ్యువేషన్ లో వదిలేస్తే మరీ ఎక్కువ భారం అయిపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తల్లికి సంబంధించి ఆది చెప్పిన విషయాల గురించి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.అక్టోబర్ నెల 24వ తేదీన ఈ ఈవెంట్ బుల్లితెరపై ప్రసారం కానుంది.