2024 ఎన్నికల్లో జనసేన( Janasena ) కేవలం 24 స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయడం జన సైనికులలో ఒకింత అసంతృప్తికి కారణమవుతోంది.తక్కువ సీట్లలో పోటీ చేయడం వల్ల పవన్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం నెరవేరుతుందో లేదో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అయితే హైపర్ ఆది తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియో ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![Telugu Ap, Chandra Babu, Hyper Aadi, Janasena, Pawan Kalyan-Movie Telugu Ap, Chandra Babu, Hyper Aadi, Janasena, Pawan Kalyan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/social-media-Janasena-pawan-kalyan-Hyper-Aadi-politics-tdp.jpg)
జనసేనకు 24 సీట్లు అని ప్రకటన వెలువడగానే చాలామంది పవన్ ను తిడుతున్నారని కొంతమంది అలుగుతున్నారని మరి కొందరు అసంతృప్తి చెందుతున్నారని కొందరు మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారని ఆయన తెలిపారు.జనసేన స్టిక్కర్లను పీకేస్తున్నారని ఈ ఘటనల వల్ల చాలా బాధ కలిగిందని హైపర్ ఆది కామెంట్లు చేశారు.ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షితో ఆలోచించాలని హైపర్ ఆది( Hyper Aadi ) పేర్కొన్నారు.
![Telugu Ap, Chandra Babu, Hyper Aadi, Janasena, Pawan Kalyan-Movie Telugu Ap, Chandra Babu, Hyper Aadi, Janasena, Pawan Kalyan-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/social-media-Janasena-pawan-kalyan-Hyper-Aadi-ap-politics-tdp.jpg)
తనను నమ్ముకున్న ప్రజలను కానీ తనను నమ్మిన నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్( Pawan kalyan ) కు ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.పవన్ ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారో ఆలోచించాలని హైపర్ ఆది వెల్లడించారు.శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా పవన్ గురించి మాట్లాడటం రైట్ కాదని ఆయన తెలిపారు.2019లో పవన్ ను గెలిపించుకోలేనని మనకు పవన్ ను ప్రశ్నించే హక్కు ఉందా అని హైపర్ ఆది వెల్లడించారు.పిల్లల కోసం దాచిన డబ్బును సైతం ఖర్చు చేసి పవన్ కౌలు రైతుల కష్టాలు తీర్చారని ఆయన చెప్పుకొచ్చారు.అప్పు చేసి మరీ పవన్ పార్టీ నడుపుతున్నారని ఆయన అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సాయం చేసిన నటుడు పవన్ నటి హైపర్ ఆది వెల్లడించారు.హైపర్ ఆది చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రజలు పంచే ప్రేమకు బానిస అని హైపర్ ఆది తెలిపారు.