కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల దందా పై కన్నెర్ర చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వీటికి కోవిడ్ చికిత్స లైసెన్స్‌ ర‌ద్దు.. !

జరగవలసిన నష్టం జరిగిపోయింది.ఎన్నో కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి.

 Hyderabad Five Private Hospitals Covid Treatment License Suspended, Hyderabad, F-TeluguStop.com

ఇప్పటికే కోట్లల్లో డబ్బులు కూడబెట్టుకున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు.పంటలు ఎండిపోయాక వర్షాలు పడినట్లుగా ఇప్పుడు హడావుడిగా తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల దందా పై కన్నెర్ర చేస్తుంది.

హైదరాబాద్ లో మానవత్వం మరిచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న 5 ఆసుపత్రులకు కరోనా సేవల లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారి చేసింది.ఆ ఆస్పత్రులేంటో తెలుసుకుంటే.

కాచిగూడలో ఉన్న టీఎక్స్‌, బంజారాహిల్స్‌లోని విరించి, సనత్‌నగర్‌లోని నీలిమ, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్‌ హెల్త్‌, బేగంపేటలోని విన్‌ ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్ ట్రీమెంట్ క్యాన్సల్ చేసిన ఆస్పత్రుల లిస్టులో ఉన్నాయట.ఇకనుండి అయినా కరోనా పేషెంట్స్ నుండి అక్రమ వసూల్లు ఆపేసి నిజాయితీగా వైద్యం చేయండని, ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటించకుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది.

కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోతున్న తరుణంలో, ఈ హడావుడి ఏంటో ప్రజలకు అర్ధం కావడం లేదట.అదీగాక కరోనా పేరిట దోచుకున్న ఆస్పత్రులు ఈ ఐదేనా అని నోరెళ్ల పెడుతున్నారట జనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube