Congress MP Tickets : కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్ .. ఆశావాహులు వీరే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress Party ) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు.ప్రస్తుతం లోక్ సభ కు( Lok Sabha ) పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.

 Huge Demand For Congress Mp Tickets These Are The Aspirants-TeluguStop.com

  రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాల నుంచి ఎవరిని పోటీకి దించితే గెలుపు ఖాయం అనే లెక్కల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతల పేర్లను పరిశీలనకు తీసుకుంది.

వారిలో గెలుపు అవకాశాలు ఉన్నా వారిని గుర్తించే పనిలో ఉంది.దీంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.

ఇప్పటికీ తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది.అభ్యర్థుల విషయంలో పిఈసి సభ్యుల అభిప్రాయాలను నమోదు చేశారు.అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన, గెలుపు అవకాశాలున్న నేతలను రంగంలోకి దించేందుకు వడబోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పి.ఈ.సి సమావేశంలో తెలంగాణలో 15 లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.ఇప్పటికే 17 అసెంబ్లీ స్థానాల కోసం 39 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.వీరిలో అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి.

వీటిని పరిశీలించి ఫైనల్ చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.మొత్తంగా 17 పార్లమెంటు స్థానాలకు 309 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు.

Telugu Aicc, Bandla Ganesh, Congress, Congressmp, Jagga, Jana, Renuka Choudary,

వరంగల్ (ఎస్సీ) – అద్దంకి దయాకర్,( Addanki Dayakar ) సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నరసింహులు.

నాగర్ కర్నూల్ (ఎస్సీ ) – సంపత్ కుమార్ , మల్లు రవి,( Mallu Ravi ) చారకొండ వెంకటేష్.

అదిలాబాద్ (ఎస్టి ) – నరేష్ జాదవ్ , సేవాలాల్ రాథోడ్, రేఖ నాయక్.

మహబూబాబాద్ ( ఎస్టి) – బలరాం నాయక్ ,ఎల్లయ్య నాయక్ ,విజయ బాయి

ఖమ్మం (జనరల్ )– రేణుక చౌదరి ,పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్ , మల్లు నందిని ( సోనియా గాంధీ పేరు కూడా వినిపిస్తోంది )

హైదరాబాద్ (జనరల్ )– సమీర్ ఉల్లా, సూరం దినేష్, ఆనంద్ రావు ( ఎంబిటీ)

Telugu Aicc, Bandla Ganesh, Congress, Congressmp, Jagga, Jana, Renuka Choudary,

కరీంనగర్ (జనరల్ )- ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు, నేరెళ్ల శారద.

పెద్దపల్లి (ఎస్సీ ) – గడ్డం వంశీ ,వెంకటేష్ నేత.

నిజామాబాద్ (జనరల్ ) – ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ), సునీల్ రెడ్డి ( ఆరెంజ్ ట్రావెల్స్) ,

మెదక్ (జనరల్ )జగ్గారెడ్డి ,( Jaggareddy ) మైనంపల్లి హనుమంతరావు.

జహీరాబాద్ ( జనరల్ )– సురేష్ షట్కర్, త్రిష ( మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె ) , శ్రీకాంత్ రావు.

మల్కాజిగిరి ( జనరల్ )– బండ్ల గణేష్,( Bandla Ganesh ) హరి వర్ధన్ రెడ్డి ,సర్వే సత్యనారాయణ.

Telugu Aicc, Bandla Ganesh, Congress, Congressmp, Jagga, Jana, Renuka Choudary,

సికింద్రాబాద్ (జనరల్ )– అనిల్ కుమార్ యాదవ్ ,నవీన్ యాదవ్, విద్యా స్రవంతి.

చేవెళ్ల (జనరల్ ) – చిగురింత పారిజాత నరసింహారెడ్డి, దామోదర్ అవేలి

మహబూబ్ నగర్ (జనరల్ ) – వంశీ చంద్ రెడ్డి, జీవన్ రెడ్డి ( ఎంఎస్ఎన్ ఫార్మా) ,  సీత దయాకర్ రెడ్డి.

నల్గొండ (జనరల్ )జానారెడ్డి,( Janareddy ) రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి.

భువనగిరి (జనరల్ )– చామల కిరణ్ కుమార్ రెడ్డి , పున్నా కైలాస్ నేత , పవన్ కుమార్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube