ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా సాగుతున్నాయి మన అందరికీ తెలిసిందే.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ – జనసేన కలిసి రాబొయ్యే ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్నాయి అని అధికారిక ప్రకటన చెయ్యడం తో అధికార వైసీపీ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది.
అయితే రెండు పార్టీలు కలిసాయి కానీ, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘వారాహి విజయ యాత్ర’ ని, అలాగే లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ని ఎందుకు ఆపి వెయ్యాల్సి వచ్చింది అనే దానిపై సందిగ్దత మొదలైంది ఇరు పార్టీల అభిమానుల్లో.కానీ పొత్తు ప్రకటించిన రోజు నుండి నేటి వరకు జనసేన మరియు టీడీపీ ఉమ్మడి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండడం, టీడీపీ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపిండిస్తూ ముందుకు వెళ్లడం వంటి కార్యక్రమాలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.

క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల క్యాడర్స్ అన్నదమ్ములు లాగ కలిసిపోయిన తర్వాత జనాల్లోకి వెళ్తే అద్భుతంగా ఉంటుందని, ఆ విధంగా ఇరు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి.దానికి తోడు ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికల హడావుడి మొదలైంది.ఈ హడావుడి లో అందరి ద్రుష్టి తెలంగాణ ఎన్నికల మీదనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇరు పార్టీలు జనాల్లోకి వెళ్లే సరైన సమయం కాదని నిర్ణయించుకున్నాయి.డిసెంబర్ నుండి ఉమ్మడి కార్యాచరణ, మరియు ఉమ్మడి మ్యానిఫెస్టో తో టీడీపీ – జనసేన పార్టీలు( TDP Janasena ) ముందుకు కదలబోతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే నేడు హిందూపురం లో ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ( Mla Nandamuri Balakrishna ) అద్వర్యం లో టీడీపీ – జనసేన సమన్వయ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ ముఖ్యనాయకులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పాటుగా బాలయ్య బాబు కూడా పాల్గొన్నాడు.

ఆ సందర్భంగా బాలయ్య బాబు జనసేన కండువా మెడలో వేసుకొని, కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రము లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని తమ్ముడు పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి పోరాటం చెయ్యడానికి ముందుకు వచ్చాడు.ఈ సందర్భంగా ఆయనకీ మరియు జనసైనికులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.జై తెలుగు దేశం.జై జనసేన’ అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు కార్యకర్తల్లో నూతనోత్సాహం ని నింపింది.బాలయ్య స్థాయి వ్యక్తి ఇలా ఈగో ని పక్కన పెట్టాడు అంటే, ఇక ఇరు పార్టీల కార్యకర్తలు కూడా అలా కలిసిపోయి ఉమ్మడిగా రాక్షస పాలనపై పోరాడాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.