తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది.దొమ్మేరుకు చెందిన బొంత మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగ నాగార్జున వెళ్లారు.
అయితే హోంమంత్రి తానేటి వనిత వాహనాన్ని దొమ్మేరు గ్రామస్తులు అడ్డుకున్నారు.బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నడుమ మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.