హిలేరియస్ వీడియో: ప్రాపర్ క్రికెట్ అంటే ఇదే అంటున్న మైకేల్ వాన్..!

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Hilarious Video: Michael Vaughan Says This Is What Proper Cricket Means ..!micha-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే ఇంగ్లాండ్ జట్టు సీనియర్ ప్లేయర్ మైకెల్ వాన్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారు.ఎప్పటికప్పుడు ప్రపంచ క్రికెట్ లో జరుగుతున్న సంఘటనలపై సంబంధించి తనదైన శైలిలో అభిప్రాయాలను తెలియజేస్తూ క్రికెట్ అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.

తాజాగా ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ లో ఓడిపోయిన సందర్భంగా అహ్మదాబాద్ పిచ్ పై అనేక విమర్శలు చేసి ఇండియన్ ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు కూడా.అయితే ఆ తర్వాత తన పొరపాటును తెలుసుకొని టీమిండియా పై ప్రశంసల జల్లు కురిపించాడు.

దాంతో టీమిండియా అభిమానులు కాస్త కుదుట పడ్డారు.

ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా క్రికెట్ కు సంబంధించిన ఓ సరదా వీడియో ని ఆయన షేర్ చేశాడు.

ఈ వీడియో ని షేర్ చేస్తూ ఈ వీడియో చూసిన వారు కచ్చితంగా నవ్వు ఆపకుండా ఉండలేరంటూ తెలియజేస్తూనే క్రికెట్ అంటే ఇదే అంటూ వీడియోను షేర్ చేశాడు.ఇక మైకెల్ వాన్ షేర్ చేసిన వీడియోలో ఫీల్డింగ్, వికెట్ల మధ్య బ్యాట్స్మెన్ రన్నింగ్ ఇలా అన్ని విధాల వీడియో చూడడానికి నవ్వు తెప్పించేలా ఉంది.

ఈ వీడియోలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు సభ్యులు చేసిన పనికి ఇద్దరు బ్యాట్స్మెన్స్ వికెట్ల మధ్యలో పరుగులు చేస్తూనే ఉన్నారు.ఫీల్డింగ్ చేస్తున్న జట్టు సభ్యులు మాత్రం ఆ బాల్ వికెట్ల పైకి తీసుకు రాలేక అనేక తిప్పలు పడుతూనే ఉన్నారు.దీంతో ఈ వీడియోని చూసి ప్రపంచ క్రికెట్ అభిమానులు తెగ జోకులు వేస్తున్నారు.ఈ వీడియోని ముందుగా ఓ నెటిజన్ షేర్ చేయగా ఆ వీడియోను చూసిన మైకెల్ వాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి తెగ నవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube