నీకు అవకాశంకు ఓకే.. మరి నాకు అవకాశం ఇస్తావా?   Heroine Payal Rajput Slaps Filmmaker     2018-10-20   10:00:05  IST  Ramesh P

సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. వందల సంఖ్యలో అమ్మాయిలు హీరోయిన్స్‌ అవ్వాలని కలలు కంటూ ఉంటే, పది మందికి ఆ అవకాశం వస్తుంది, ఆ పది మందిలో ఎక్కువ శాతం ఒకటి రెండు సినిమాలకే సర్దేసుకు పోతారు. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. అలాంటి ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌గా చెప్పుకోవచ్చు. ఈమె ఛాన్స్‌ల కోసం ఎంతగానో ప్రయత్నించింది. చివరకు ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ఛాన్స్‌ దక్కించుకుంది. వచ్చిన మొదటి అవకాశంను పూర్తిగా వినియోగించుకుంది.

కార్తికేయ హీరోగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో పాయల్‌కు స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ దక్కింది. దాంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. అయితే మొదటి సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌ చేయడం వల్ల తన తదుపరి అన్ని చిత్రాల్లో కూడా బోల్డ్‌గా నటించాలని, ముద్దు సీన్స్‌కు ఓకే చెప్పాలని, రొమాంటిక్‌గా నటించాలని అడుగుతున్నారట. మొదటి సినిమా కనుక, ఆ చిత్రంలో కథకు తగ్గట్లుగా అలా బోల్డ్‌గా నటించాల్సి వచ్చింది. అంతే తప్ప తాను బోల్డ్‌ హీరోయిన్‌గా మిగిలి పోవాలని భావించడం లేదని పాయల్‌ అంటోంది.

Heroine Payal Rajput Slaps Filmmaker-

తాజాగా ఈమె వద్దకు ఒక ఫిల్మ్‌ మేకర్‌ వెళ్లి నీకు మా సినిమాలో ఛాన్స్‌ ఇస్తాం, మరి మాకు కూడా నీవు ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రశ్నించాడట. దాంతో పాయల్‌కు అతడి చెంప పగులకొట్టాలనేంత కోపం వచ్చిందట. అయినా కూడా కంట్రోల్‌ చేసుకుని అందుకు వేరేవారిని చూసుకోండి, నా ట్యాలెంట్‌కు నాకు ఇతర ఫిల్మ్‌ మేకర్స్‌ నుండి ఆఫర్లు వస్తున్నాయంటూ అతడికి గుడ్‌ బై చెప్పిందట. ఎవరా ఫిల్మ్‌ మేకర్‌ అంటే మాత్రం పాయల్‌ సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు. పాయల్‌ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.