ప్రస్తుత కాలంలో అనేకమంది తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటూ తెగ ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో తయారయ్యారు.ఇదివరకు కాలంలో 60 సంవత్సరాలు దాటిన వారు మోకాళ్లనొప్పులతో ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం జనరేషన్ లో 40 సంవత్సరాలు వచ్చాయంటే చాలు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి అంటూ లబోదిబోమంటున్నారు.
ఇదివరకు సమయంలో నొప్పులు వచ్చాయంటే వయస్సు అయిపోయిందని అందరూ భావించారు.అయితే ప్రస్తుత కాలంలో ఆ వయసుతో సంబంధం లేకుండా ఈ కీళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నాయి.
అయితే ఇందుకు కారణం లేకపోలేదు.వారు తీసుకునే ఆహారపు అలవాట్ల మీద ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందులు పెడుతున్నాయి.
ఒక్కసారి ఈ మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయో జీవితాంతం వారికి ఈ బాధ భరించాల్సి ఉంటుంది.అయితే ఇలా మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారు కాస్త డబ్బు ఉన్న వారైతే లక్షలకు లక్షలు కట్టేసి వాటికి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మరి డబ్బులు లేని వారి సంగతి ఎలా అని ఆలోచిస్తున్నారా.? వారు కూడా వారికి స్థోమతకు తగ్గట్టుగా ఏదో ఒక మెడిసిన్ తీసుకొని అప్పటికి ఆ నొప్పి నుండి ఉపశమనం పొందిన చివరికి పూర్తిగా మాత్రం మోకాళ్ల నొప్పులను నయం చేసుకోలేకపోతున్నారు.అయితే ఎన్ని మాత్రలు వేసుకున్నా చివరికి మోకాళ్లనొప్పులు మనం చింతపండు ఉపయోగించే సమయంలో పారేసే చింతగింజల వల్ల తగ్గుతుందని ఇప్పటికే రుజువైంది కూడా.ఈ విషయాన్ని ఆయుర్వేద నిపుణులు కూడా అంగీకరిస్తారు.
అయితే ఇందుకు సంబంధించి చింత గింజలు ఎలా ఉపయోగించాలో మోకాళ్ళ నొప్పులకు ఎలా మందును ఎలా తయారుచేసుకోవాలో ఓ సారి చూద్దాం.

ముందుగా కొన్ని చింత గింజలను తీసుకొని పేనం లో వేయించుకోవాలి.అలా బాగా వేడి చేసిన చింతగింజలను రెండు రోజుల పాటు నీటిలో బాగా నానబెట్టాలి.ఈ రెండు రోజులలో ఒకరోజు తర్వాత నీటిని మారుస్తూ మరో రోజు కూడా వాటిని నానబెట్టాలి.
అలా నానబెట్టిన తర్వాత చింత గింజలకు పొట్టు తీయడానికి చాలా సులువుగా వస్తుంది. పొట్టు తీసిన తర్వాత చింత గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టుకోవాలి.
అలా ఎండిన చింత గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.అలా వచ్చిన చింత గింజల పొడిని ప్రతిరోజు ఒక చెంచా తో వేడిపాలల్లో కలుపుకొని తీసుకోవాలి.
ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నుంచి 40 రోజుల పాటు సేవిస్తే మీ మోకాళ్ల నొప్పుల నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇలా ఒక నెల పాటు నిరంతరంగా శ్రమించండి మంచి ఫలితాలను పొందండి.