కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ( YS Avinash Reddy )బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ( Vivekananda Reddy )హత్య కేసులో మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ జరిపింది.ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది.
ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో నాన్ మిస్లేనియస్ డే రోజు లిస్ట్ చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది.కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు.దీనిపై సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ కేసు డైరీ 60 భాగాలుగా ఉందని కోర్టుకు తెలిపారు.దీంతో డిజిటల్ రూపంలోకి మార్చి ఈ-డైరీ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణ చేసే పరిస్థితి లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు.