యాక్షన్ హీరో గోపీచంద్( Gopichand ) హీరోగా శ్రీ వాస్ ( Shri vas )దర్శకత్వంలో రూపొందిన రామబాణం చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యింది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ మేకర్స్ తెగ చెబుతున్నారు.ఈ సినిమా ప్రెస్ మీట్ ల్లో సినిమా విజయం గురించి తెగ మాట్లాడిన మేకర్స్ ఈ సమ్మర్ విజేత తమ రామబాణం( Rambanam ) అంటూ ధీమా వ్యక్తం చేశారు.
బాబోయ్ ఈ రేంజ్ నమ్మకం ఏంట్రా బాబు అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది.
ఇక ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈసినిమా కి టైటిల్ ను పెట్టాడు అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు.డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించింది.
తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది.
తెలుగు లో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గోపీచంద్ కు గడచిన కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ అనేది లేదు.ఆయన సక్సెస్ అనే పదాన్ని కూడా మర్చి పోయాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అలాంటి పరిస్థితుల నుండి రామబాణం సినిమా గోపీచంద్ ను బయటకు తీసుకు వస్తుంది అనే నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన రామబాణం సినిమా కనుక వసూళ్ల విషయంలో పాతిక కోట్ల వరకు చేరితే గోపీచంద్ కు కమర్షియల్ బ్రేక్ దక్కినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరి ఈ విషయంలో గోపీచంద్ కు సక్సెస్ ఇచ్చే విధంగా రామబాణం సినిమా సఫలం అవుతుందా అనేది చూడాలి.