అల్లరి నరేశ్( Allari Naresh ) అంటే ఒకపుడు కామెడీ సినిమాలు గుర్తుకు వచ్చేవి కానీ ఆయన ఇప్పుడు రూట్ మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు అందులో భాగంగా వచ్చిన మూవీనే నాంది మూవీ…ఈ మూవీతో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు.ఈ మూవీ ద్వారా తనలోని కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
ఇక ఇప్పుడు నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వలోనే ఉగ్రంతో( Ugram Movie ) అలరించేందుకు సిద్ధం అయ్యాడు.ఉగ్రం సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్, సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాను పెంచాయి.
మంచి అంచనాల నడుమ మే 5న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వస్తుంది .ఈ క్రమంలో ఇప్పటికే యుఎస్ఏ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి .ఈ ప్రీమియర్ షో టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద పలు సీనియాలు వసూళ్ల వర్షం కురిపించాయి.మరి ఉగ్రం యుఎస్ ఆడియెన్స్ ని ఏ మేరకు అలరించింది .
కొత్త తరహా చిత్రాలకి నాంది పలికిన నరేష్ ఈ చిత్రం తో మరో విజయాన్ని అందుకున్నారా లేదా అనేది యుఎస్ ఆడియెన్స్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.ఎలాంటి పాత్రని అయినా అవలీలగా పోషించగల నటుడిగా నరేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది .ఇక ఈ చిత్రంలో సీరియస్ పాత్రలో నరేష్ చక్కగా నటించారని అంటున్నారు .శివకుమార్ అనే పోలీస్ పాత్రలో జీవించేశాడని సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు .భార్య పిల్లలతో హ్యాపీగా గడుపుతున్న ఓ పోలీస్ .తన డ్యూటీ కి సంబంధించిన కేసులో చిక్కుల్లో పడటం .తన భార్య పిల్లలతో పాటు చాలామంది మిస్సింగ్ అవ్వడం వెనుక ఉన్న మిస్టరీని చేదించే క్రమంలో సమస్యలు ఎదుర్కొవడం వంటివి చక్కగా చూపించారని అంటున్నారు .సినిమాలో అల్లరి నరేష్ పర్ఫామెన్స్ , అలాగే అయన చూపించిన వేరియేషన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాలతో అల్లరి నరేష్ తన విశ్వరూపం చూపించేసాడనేది సినిమ చూసిన ఆడియెన్స్ మాట .యుఎస్ ప్రీమియర్ షో ని( Ugram US Premiere ) చూసిన ప్రతీ ఒక్కరు అల్లరి నరేష్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు, చాలా సన్నివేశాల్లో ఆయన యాక్షన్ సీక్వెన్స్ లు చూసి భయపడిపోయామని కూడా చెబుతున్నారు .ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడిగా మలయాళ ముద్దుగుమ్మ మీర్జా మీనన్ నటించింది.ఆమె కూడా చక్కగా నటించింది అంటున్నారు .శ్రీ చరణ్ పాకాల మంచి సంగీతాన్ని సమకూర్చారని .అలాగే తూమ్ వెంకట్ అందించిన కధ కొత్తగా బాగుందని చెబుతున్నారు .ఇక.అబ్బూరి రవి డైలాగ్స్ అదుర్స్ అనే మాట వినిపిస్తుంది .
ఉగ్రం మూవీతో నటుడిగా నరేష్ మరో పది మెట్లు ఎక్కేశాడని చెబుతున్నారు .యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయని, నరేష్ వన్ మ్యాన్ షో చేశాడని .ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు .ముఖ్యంగా మిస్సింగ్ లకి సంబందించిన విషయాలని చూపించిన విధానం మెప్పిస్తుంది అంటున్నారు .మన దేశంలో గంటకు సగటున 85 మంది.రోజుకు సగటున 2030 మంది.
ప్రతినెల 65 వేల మందికి వరకు చిన్నలు పెద్దలు మిస్ అవుతూ ఉన్నారు.ఈ మిస్సింగ్స్ వెనకాల ఉన్న పెద్ద తలకాలను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు అద్భుతంగా చూపించారని టాక్ ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ పేరుతో పిలవడం కష్టమే అని … నరేష్ పూర్తి మేకోవర్‌తో చేసిన ఈ సినిమా అతని కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచే అవకాశలున్నాయని చెబుతున్నారు .