మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు!, ఇడియట్, ఖడ్గం, వెంకీ, విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు.ఈ హీరో ఒకే డైరెక్టర్ తో మూడు సినిమాలు చేసి 3 హిట్స్ కొట్టి రికార్డు కూడా సృష్టించాడు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని.వీరిద్దరూ కలిసి డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి మూడు సినిమాలు తీశారు.
అవి మూడు సూపర్ హిట్స్ అయ్యాయి.రవి తేజ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలయ్యాయి.
మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక మూవీ చేయబోతున్నారని ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇటీవల వచ్చింది.ఈ సినిమాని తామే ప్రొడ్యూస్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) సంస్థ వెల్లడించింది.
అయితే ఇప్పుడు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు ఆటకెక్కిందని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రచారం మొదలయ్యింది.అవే పుకార్లు నిజమన్నట్టు డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాని ఒక బాలీవుడ్ హీరోతో చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వెల్లు వెత్తుతున్నాయి.
రెండు ప్రచారాలలో నిజం ఎంతో తెలియ రాలేదు.కానీ పుకార్లు మాత్రం భారీ ఎత్తున షికారు చేస్తున్నాయి.

రూమర్స్ ప్రకారం డైరెక్టర్ గోపీచంద్( Gopichand malineni ) బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సన్ని డియోల్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడట.అదే సినిమాని ముందుగా రవితేజతో అనుకోవడం, దానిని ప్రకటించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.ఈ ప్రాజెక్టు నుంచి రవితేజని తప్పించడానికి ప్రధాన కారణం బడ్జెట్ అని అంటున్నారు.నిర్మాతలు రవితేజకి ఎక్కువ పారితోషికం ఇవ్వలేక వేరే హీరోని సెలెక్ట్ చేసుకోవాలని గోపీచంద్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందుకే గోపీచంద్ తక్కువ శాలరీ తీసుకునే బాలీవుడ్ హీరో సన్ని డియోల్ ను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలానే బాలీవుడ్ లో తక్కువ శాలరీలకే నటించే టాలెంటెడ్ యాక్టర్స్ ని తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇకపోతే రవితేజ ఇటీవల కాలంలో ఎంత కష్టపడినా ఒక హిట్ కూడా రావడం లేదు.ప్రస్తుతం ఈ మాస్ హీరో హరిష్ శంకర్ తో కలిసి బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్ లో యాక్ట్ చేస్తున్నాడు.దీనికి మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే టైటిల్ కూడా ఫైనలైజ్ చేశారు.
ఈ సినిమాతో నైనా అతడి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.