'గంజాయి శంకర్'గా సాయి తేజ్.. కొత్త సినిమా షూట్ స్టార్ట్!

మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( ( Sai Dharam Tej ) ఒకరు.మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్ట పడుతున్నాడు.

 Ganjayi Shankar Is The Title For Sai Dharam Tej's Next, Sai Dharam Tej, Pawa-TeluguStop.com

మెగా హీరో అనే చట్రం నుండి బయటపడి తనకంటూ స్పెషల్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కోవాలని బాబు ఆరాట పడుతున్నాడు.

Telugu Bro, Ganjayi Shankar, Ganjayishankar, Pawan Kalyan, Sai Dharam Tej, Sampa

ఈ క్రమంలోనే సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన విరూపాక్ష సినిమా( Virupakasha )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’ (Bro) లో నటించగా ఇది యావరేజ్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.బ్రో తర్వాత కొద్దీ విరామం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాను సెట్స్ మీదకు తెచ్చాడు.

సంపత్ నంది( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాను ఈ రోజు సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు.

సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత సంపత్ నంది ( Sampath Nandi ) సాయి తేజ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు.ఈ సినిమా ఈ రోజు స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.

జైలు నేపథ్యంలో సాగే ఈ సినిమాను డీసెంట్ బడ్జె ట్ తో తెరకెక్కించ నున్నట్టు తెలుస్తుంది.ఇక సాయి తేజ్ పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో అయితే కనిపించనున్నారట.

Telugu Bro, Ganjayi Shankar, Ganjayishankar, Pawan Kalyan, Sai Dharam Tej, Sampa

మరి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.‘‘గంజాయి శంకర్’‘ ( Ganjayi Shankar) అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్టు టాక్.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్ నంది సాయి తేజ్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు.చూడాలి ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube