ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి( TDP ) షాక్ తగిలింది.ఆ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ( Vairicharla Kishore Chandradev )రాజీనామా చేశారు.
బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పొత్తు కోసం చర్చలు జరపడాన్ని వైరిచర్ల కిశోర్ బాబు వ్యతిరేకించారు.ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కిశోర్ చంద్రదేవ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల తరువాత కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీకే పరిమితం అయ్యారు.