America : అమెరికా : అద్దె విషయంలో ఘర్షణ .. భారత సంతతి మోటెల్ యజమాని కాల్చివేత

అమెరికా( America )లో భారతీయుల హత్యలు కొనసాగుతూనే వున్నాయి.ఇప్పటికే ఐదుగురు భారతీయ విద్యార్ధులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోగా.

 Indian American Motel Owner Shot Dead After Altercation Over Room Rent-TeluguStop.com

గత వారం రోడ్డుపై జరిగిన ఘర్షణలో భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌పై దుండగుడు దాడి చేయడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.తాజాగా భారత సంతతికే చెందిన మోటెల్( Hillcrest Motel in Sheffield ) యజమానిని దుండగుడు కాల్చిచంపారు.

అలబామా రాష్ట్రంలో గది అద్దె విషయంలో జరిగిన ఘర్షణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.షెఫీల్డ్‌లోని హిల్‌క్రెస్ట్ మోటెల్ యజామని 76 ఏళ్ల ప్రవీణ్ రావోజీభాయ్ పటేల్( Pravin Raojibhai Patel ) గత వారం ప్రాణాలు కోల్పోయాడు.

నిందితుడిని 34 ఏళ్ల విలియం జెరెమీ మూర్‌గా గుర్తించి అరెస్ట్ చేసినట్లు మీడియా నివేదించింది.

-Telugu NRI

మూర్ 13 అవెన్యూలోని ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసినట్లు షెఫీల్డ్ పోలీస్ చీఫ్ రికీ టెర్రీ( Sheffield Police Chief Ricky Terry ) తెలిపారు.పరిశోధకుల ప్రకారం.ఫిబ్రవరి 8న పటేల్‌తో వాగ్వాదం జరిగినప్పుడు మూర్ మోటెల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు.

కానీ ఏమైందో కానీ తుపాకీతో పటేల్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు.మూర్‌( Moore )ను తనిఖీ చేయగా అతని వద్ద తుపాకీ లభించినట్లు టెర్రీ వెల్లడించారు.

వారెంట్ జారీ అయ్యే వరకు మూర్ షెఫీల్డ్ సిటీ జైలులో వున్నాడని .తర్వాత అతనిని కోల్‌బర్ట్ కౌంటీ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

-Telugu NRI

పటేల్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అలబామా ఫోరెన్సిక్ ల్యాబ్‌( Alabama Forensics Lab )కు తరలించారు.ఫిబ్రవరి 12న టుస్కుంబియాలోని మోరిసన్ ఫ్యూనరల్ హోమ్‌లో అతనికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సంఘటనపై ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్‌వోఏ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.హింసాత్మక చర్యలకు సమాజంలో స్థానం లేదని అసోసియేషన్ ఛైర్మన్ భరత్ పటేల్ పేర్కొన్నారు.

పటేల్ కుటుంబానికి అధికారులు న్యాయం చేయాలని .ఆయన షెఫీల్డ్ పట్టణంలో దాదాపు నాలుగు దశాబ్ధాలుగా మోటెల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో భారతీయ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube