కడప జిల్లా ప్రొద్దుటూరు( Proddatur )లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో దేవుడి భూమి స్వాహా అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
టీడీపీ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి( TDP Nandyala Varada Rajulu Reddy ) ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయని తెలుస్తోంది.చెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించిన రూ.40 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించి రోడ్లు వేశారంటూ వరద రాజుల రెడ్డి ఫ్లెక్సీల్లో( Flexi War ) ఆరోపించారు.ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వరదరాజుల రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు వరదరాజులు రెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( MLA Rachamallu Shivaprasad Reddy ) కౌంటర్ ఇచ్చారు.టీడీపీ నేత ఆరోపిస్తున్నట్లు తాను ఆ భూమిని కబ్జా చేయలేదని తెలిపారు.ఆ భూమిలో చెత్తను తొలగించి, పరిశుభ్రం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.గతంలో వరదరాజుల రెడ్డి, సుబ్బారాయుడు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రాచమల్లు ఆరోపించారు.
దీంతో ప్రొద్దుటూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.