Proddatur : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీల వివాదం

కడప జిల్లా ప్రొద్దుటూరు( Proddatur )లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో దేవుడి భూమి స్వాహా అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

టీడీపీ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి( TDP Nandyala Varada Rajulu Reddy ) ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయని తెలుస్తోంది.

చెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించిన రూ.40 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించి రోడ్లు వేశారంటూ వరద రాజుల రెడ్డి ఫ్లెక్సీల్లో( Flexi War ) ఆరోపించారు.

ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వరదరాజుల రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.

"""/"/మరోవైపు వరదరాజులు రెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( MLA Rachamallu Shivaprasad Reddy ) కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ నేత ఆరోపిస్తున్నట్లు తాను ఆ భూమిని కబ్జా చేయలేదని తెలిపారు.ఆ భూమిలో చెత్తను తొలగించి, పరిశుభ్రం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

గతంలో వరదరాజుల రెడ్డి, సుబ్బారాయుడు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రాచమల్లు ఆరోపించారు.

దీంతో ప్రొద్దుటూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

బాలయ్య పాదాలకు నమస్కరించి అవార్డు అందుకున్న ఐశ్వర్యరాయ్.. ఫ్యాన్స్ ఫిదా!