ప్రస్తుత సమాజంలో కొందరు కామంతో కళ్లు మూసుకుపోయి ముక్కుపచ్చలారని చిన్నారులను చిన్న వయసులోనే చిదిమేస్తున్నారు.తాజాగా తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి వరుసకు బాబాయ్ ఎటువంటి ఓ వ్యక్తి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని మర్లపాలెం అనే గ్రామంలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.అయితే ఇతడు పుట్టుకతోనే వికలాంగుడు.దీంతో ఏ పని చేతకాక పోవడం ఇంటి దగ్గరే ఒక చిన్న తినుబండారాలు కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.అయితే ఇదే వీధిలోనే ఇద్దరు దంపతులు తమ తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి చిన్నారితో కలిసి జీవనం సాగిస్తున్నారు.
అయితే తరచూ తినుబండారాల కోసం చిన్నారి సుబ్బారెడ్డి కొట్టుకి వెళుతూ ఉండేది.ఈ క్రమంలో చిన్నారిపై సుబ్బారెడ్డి కన్ను వేశాడు.
దీంతో ఎలాగైనా ఆ చిన్నారిని లొంగదీసుకోవాలనే పన్నాగం పన్నాడు.
అయితే ఇది ఇలా ఉండగా పని నిమిత్తమై చిన్నారి తల్లిదండ్రులు బయటికి వెళ్లగా ఇంటి ఆవరణలో చిన్నారి ఒక్కతే ఆడుకుంటుంది.దీంతో ఇది గమనించిన టువంటి సుబ్బారెడ్డి ఆ చిన్నారిని చాక్లెట్లు ఇస్తానని పిలిచి తన ఇంటి లోపలికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.అయితే ఆ తర్వాత చిన్నారి తీవ్ర భయాందోళనలకు గురి అయింది.
ఇది గమనించిన ఇటువంటి చిన్నారి తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలిపింది.విషయం తెలుసుకున్న టువంటి చిన్నారి తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సుబ్బారెడ్డి పై ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.