టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు అనే విషయం చాలా మందికి తెలిసు.ఉన్న హీరోయిన్లలో కొంతమందికి ఆఫర్లు లేక సినిమాలు మానుకుని తమపని తాము చూసుకుంటుంటే, మరికొంత మందికి దర్శకనిర్మాతల షరతులు నచ్చక సినిమాలు వదులుకుంటున్నారు.
అందం, అభినయం రెండూ ఉన్నా తెలుగు బ్యూటీలకు సినిమా ఛాన్సులు దక్కడం చాలా తక్కువే అనే వాస్తవం ఇండస్ట్రీ జనాలు కూడా ఒప్పుకున్నారు.
కానీ కొందరు సినిమా ఆఫర్లు రాకపోయినా తమదైన పద్ధతుల్లో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ క్రేజ్‌ను దక్కించుకుంటున్నారు.
వారిలో ముందు వరుసలో ఉంటుంది అందాల భామ ఈషా రెబ్బ.
ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ,రాగాల 24గంటల్లో వంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సైడ్ హీరోయిన్ పాత్రలకు సైతం ఓకే చెప్పేసింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రంలో నటించిన ఈషా రెబ్బ మంచి గుర్తింపు సాధించుకుంది.అయినా అమ్మడికి సినిమా ఆఫర్లు పెద్దగా రావడం లేదు.
దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్‌లతో, తన అందాల ఆరబోతతో కుర్రకారు మతిపోగుడుతోంది ఈ చిన్నది.ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాలే చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి హాట్ ఫోటోషూట్‌లో యూత్ ఫాలోయింగ్ పెంచుకోవచ్చే విషయాన్ని ఈ తెలుగమ్మాయి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా ఇప్పుడు తన సోషల్ అకౌంట్‌ల ద్వారా ఫైర్ పుట్టిస్తోంది.
అందాలతో ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఈషా చేస్తు్న్న బోల్డ్ ఫోటోషూట్‌లు ఆమెకు మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ను తీసుకొస్తున్నాయి.ఈ ఫోటోలతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని చూస్తున్నారు.మరి ఈ అమ్మడికి ఎలంటి సినిమా ఆఫర్లు వస్తాయో చూడాలి.