తిరుపతి ఎపిక్ కార్డుల కేసులో పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.ఈ మేరకు గతంలో పని చేసిన ఇద్దరు తిరుపతి సీఐలు, ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
అలాగే అలిపిరి సీఐ దేవేంద్రను వీఆర్ కు బదిలీ చేసింది.కాగా ఈ కేసులో ఇప్పటికే అన్నమయ్య కలెక్టర్ గిరీషాతో పాటు అప్పటి తిరుపతి అడిషనల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ పై సస్పెండ్ వేటు పడిన సంగతి తెలిసిందే.
తిరుపతి ఉప ఎన్నికలో అక్రమంగా 34 వేల ఓటరర్ ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ పై అధికారులు కేసు నమోదు చేశారు.