ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్ళుగా మారండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మెగా రక్త దాన శిబిరం”ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రక్తదానం చేసి మిగితా వారికి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ.

 Donate Blood To The Dying And Become Gods Before Them , Donate Blood, Sandeep Ku-TeluguStop.com

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా( ఫ్లాగ్ డే) ఈ రోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల,కరీంనగర్, మంచిర్యాల,వరంగల్ రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.రక్తదాన శిబిరానికి విశేష స్పందన సుమారుగా 650 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత పాల్గొని రక్తదానం చేయగా,రక్తదానం చెసిన వారీకి ప్రశంస పత్రలను అందించి అభినందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు.

రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితులల్లో , ఉన్నప్పుడూ ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమవంతు సహాయము గా రక్త దానం చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం అభినందించ దగ్గ విషయం అని ,విధి నిర్వహణనే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది తలసేమియా, సికిల్ సెల్ అనీమియా,డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది,జిల్లాలోని యువకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube