కుమార్తె మృతి .. కెనడాలో భారతీయ కుటుంబానికి బాసట, ఫండ్ రైజింగ్‌లో భారీగా విరాళాలు

కెనడాలోని ఓ సూపర్ మార్కెట్‌లో వాక్ ఇన్ ఓవెన్ వద్ద ప్రాణాలు కోల్పోయిన 19 ఏళ్ల భారత సంతతి యువతి గురుసిమ్రన్ కౌర్‌కు( Gurusimran Kaur ) అక్కడి భారతీయ సమాజం, కెనడా పౌరులు అండగా నిలిచారు.ఆమె కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఆన్‌లైన్‌లో GoFundMe ద్వారా నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించగా ఏకంగా రూ.

 1 Crore Raised For Family Of Indian Woman Who Died In Canada , Gurusimran Kaur ,-TeluguStop.com

కోటికి పైగా అందినట్లుగా వార్తలు వస్తున్నాయి.మారిటైమ్ సిక్కు సొసైటీ ఈ నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. 50 వేల కెనడా డాలర్లు (భారత కరెన్సీలో రూ.60.78 లక్షలు) టార్గెట్‌తో ప్రారంభించిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కొద్దిగంటల్లోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని రెట్టింపు మొత్తం అందుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.

గురుసిమ్రన్ తన తల్లితో కలిసి కెనడాలోని హాలిఫాక్స్ ప్రాంతంలో( Halifax region of Canada ) ఉన్న వాల్ మార్ట్ స్టోర్‌లో పనిచేసింది.

అక్టోబర్ 19న ఆమె స్టోర్‌లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.కూతురిని నిర్జీవంగా చూసిన ఆమె తల్లి వెంటనే సాయం కోసం అర్ధించింది.దురదృష్టవశాత్తూ బేకరీ వాక్ ఇన్ ఓవెన్‌‌లో బాధితురాలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.అయితే గురుసిమ్రత్ మరణానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు.

గురుసిమ్రత్ ఆమె తల్లి మూడేళ్ల క్రితం భారత్ నుంచి కెనడాకు వలస వచ్చారు.అనంతరం దాదాపు రెండేళ్లుగా వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.

Telugu Crore, Croreindian, Canada, Gurusimran Kaur, Halifax Canada, Maritimesikh

వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు కెనడియన్ మీడియాతో మాట్లాడుతూ.గురుసిమ్రత్ కేసు నేపథ్యంలో విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.దీనిలో భాగంగా స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లుగా ఆయన తెలిపారు.బాధితురాలి తల్లితో పరిచయం ఉన్న మారిటైమ్ సిక్కు సొసైటీకి ( Maritime Sikh Society )చెందిన బల్బీర్ సింగ్ మాట్లాడుతూ.

బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.

Telugu Crore, Croreindian, Canada, Gurusimran Kaur, Halifax Canada, Maritimesikh

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఊహాజనిత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హాలిఫాక్స్ రీజినల్ పోలీస్ (హెచ్ఆర్పీ) ఓ ప్రకటనలో తెలిపింది.నోవాస్కోటియా ప్రావిన్స్ మెడికల్ ఎగ్జామినర్ బాధిత యువతి మరణానికి దారి తీసిన కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు.ఈ ప్రావిన్స్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈ విచారణలో పాల్గొంటోంది.

భారత సంతతి యువతి మరణంపై వాల్‌మార్ట్ కెనడా సంతాపం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube