ఒకపక్క బీహార్ ఎన్నికల పై ఉత్కంఠ నెలకొన్న ఈ సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌కు మంచి ఛాన్స్ ఉందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఇంకా టెన్షన్ పడుతున్నట్లు అర్ధం అవుతుంది.
ఇటీవల జరిగిన బీహార్ లో మూడు దశలుగా ఎన్నికలు జరుగగా, రేపే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.రేపే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నదని వివరించారు.దాణా స్కామ్ కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుంచి జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.లాలుకు కిడ్నీ సమస్యలు కూడా ఉండడం తో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని, కాని ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఆయనకు డయాలసిస్ చేస్తున్నామని డాక్టర్లు అంటున్నారు.

మరోపక్క ఈ రోజే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుట్టిన కావడం తో ఘనంగా వేడుకలు నిర్వహించారు.బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం లో పాల్గొని తమ పార్టీని గెలిపించాలి అంటూ కోరగా, అయితే గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా లాలూ ప్రసాద యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడమన్నది జరిగింది.ఆయన ఆరోగ్యం సరిగా లేనందునే ఆయన ఈ ఎన్నికల ప్రచార సమయంలో పాల్గొననట్లు తెలుస్తుంది.