మన దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని మనం అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే మన దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది.
అధికారం చేతిలో ఉంది కదా అని కొందరు దళారులు వారి పరపతిని ఉపయోగించుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.చట్టం ఎవరి చుట్టం కాదు అనే విషయాన్నీ మర్చిపోయి తప్పు చేసిన సర్పంచ్ ను నిలదీసినందుకు దాదాపు 40 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా గాందారి మండలం గుజ్జుల్ తండా అనే గ్రామంలో చోటు చేసుకుంది.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 జనాభా ఉన్న తండాలను గ్రామాపంచాయతీలుగా పరిగణలోకి తీసుకుని ఆ తండాలను పంచాయతీలుగా ఎర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా గాందారి మండలం గుజ్జుల్ తండాను కూడా పంచాయతీగా మార్చారు.పూర్తిగా గుట్టల మధ్యలో ఉన్న ఈ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
అలాగే వీరందరూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు.అయితే ఆ గ్రామ ప్రజలు తండాలో ఉన్నా దుర్గామాత విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కొంతమంది తండా నాయకులు కలిసి దుర్గామాత విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయని ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దుర్గామాత విగ్రహాన్ని తొలగించి తవ్వడం జరిగింది.ఈ విషయం తెలిసిన తండా వసూలు గ్రామ సర్పంచ్ ను అడగగా వాళ్ళు సమాధానం చెప్పకపోగా మమ్మల్నే నిలదీస్తారా అని దాదాపు 40 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించడం జరిగింది.
ఆ గ్రామ సర్పంచ్ అయిన దశరథ్ నాయక్, ఉప సర్పంచ్ జగదీష్ తో పాటు తండావాసులు మరో 8 మంది కలిసి ఇలా 40 కుటుంబాలను వెలివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే గుప్త నిధులు కోసం తవ్వగా వారికి అవి దొరికాయని.కానీ ఎంత డబ్బులు, నగలు దొరికాయనే విషయాలు ఎవరికీ చెప్పలేదని వాపోతున్నారు.ఇంకా దారుణం ఏంటంటే ఆ 40 కుటుంబాలను ఏలాంటి శుభకార్యాలకు, ఆశుభ కార్యలకు పిలువ కూడదని చెప్పి మరి ఆ గ్రామం నుంచి బహిష్కరణ చేసారని ఆ 40 కుటుంబాల బాధితులు ఆ జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఏ తప్పు చేయకుండానే మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారని, సర్పంచ్ గ్రూప్ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని కూడా ఉందని మమ్మల్ని కాపాడి మాకు న్యాయం చేయాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ 2005లో కూడా సర్పంచ్ గా ఉన్నారని అప్పుడు కూడా ఇలాగే బహిష్కరణ చేశారని మరో బాధితుడు అన్నాడు.
ఇప్పటికైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలనీ బాధిత తండావాసులు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.