సమంత విడాకుల ప్రకటన తర్వాత తన జోష్ పూర్తిగా పెంచేసింది.ఈ క్రమంలోనే సమంత మొట్టమొదటిసారిగా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా.
ఊ ఊ అంటావా మావా’ సాంగ్ అంటూ బోల్డ్ స్టెప్పులతో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది.ఈ క్రమంలోనే ఈ పాటలో భాగంగా సమంత ఒక మేల్ డాన్సర్ గుండెల పై కాలు పెట్టి డాన్స్ వేస్తుంది.
ఇక ఈ విషయంపై మహేష్ అభిమానులు తీవ్రస్థాయిలో సమంతను తప్పుబడుతున్నారు.గతంలో మహేష్ బాబు నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ సముద్రతీరాన నడుస్తూ వెళ్తుండగా వెనుక హీరోయిన్ కృతి సనన్ అతని అడుగుజాడలను ఆమె చేతితో తాకింది.
ఈ విషయంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయి.ఒక అబ్బాయికి అమ్మాయి ఇంతగా దాసోహం అయినట్లు చూపించాలా? ఇది మా స్త్రీ జాతికే అవమానం అంటూ సింగర్ చిన్మయి ఒక వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.ఇలా చిన్మయికి మద్దతు తెలిపిన వారిలో నటి సమంత ఒకరు.అయితే ఇదే విషయాన్ని మరోసారి మహేష్ బాబు అభిమానులు తెరపైకి తీసుకువచ్చి అప్పుడు మహేష్ బాబు చేసినది తప్పు అయితే ఇప్పుడు సమంత చేసినది ఒప్పా? అని ప్రశ్నిస్తున్నారు.

మహేష్ బాబు అడుగుజాడలను మాత్రమే కృతిసనన్ తాకడం తప్పు అయితే.ఇప్పుడు సమంత ఏకంగా ఒక మేల్ డాన్సర్ గుండెలపై కాలు పెడుతూ డాన్స్ చేయడం తప్పు కాదా అంటూ మహేష్ బాబు అభిమానులు సమంతను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.మరి ఈ ప్రశ్నలకు సమంత ఎలా స్పందించి సమాధానాలు చెబుతుందో వేచి చూడాలి.