తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.ఈ మేరకు అఫిడవిట్ లో తప్పులను ఆర్వో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
మంత్రి మల్లారెడ్డి నామినేషన్ తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.ఈ క్రమంలో అఫిడవిట్ లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి ఇప్పటికే ఆర్వో సమాధానం ఇచ్చారని ఈసీ న్యాయస్థానానికి తెలిపారు.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఈసీ సమాధానంతో పిటిషన్ ను కొట్టేసింది.