అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసిన ఉన్నం వర్గీయులు అసమ్మతిని వ్యక్తం చేశారు.
అనంతరం చంద్రబాబు( Chandrababunaidu )కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
40 ఏళ్లుగా టీడీపీ కోసం పని చేసిన వారిని కాదని చంద్రబాబు డబ్బుకు అమ్ముడు పోయారంటూ ఉన్నం వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.స్థానికేతరులకు పార్టీ టికెట్ ను ఎలా కేటాయిస్తారంటూ ఉన్నం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో కల్యాణదుర్గం అభ్యర్థిగా సురేందర్ బాబు పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.