గాడ్ ఫాదర్ లేకపోవడం వల్లే పైకి రాలేకపోతున్న దర్శకులు

రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్, కొరటాల, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, బోయపాటి శ్రీను, రాంగోపాల్ వర్మ.ఇలా ఏ దర్శకుడైన కథ చెప్తానంటే టాలీవుడ్ లో ఏ హీరో అయినా చిన్న నుంచి పెద్ద హీరో వరకు ఎవరైనా కూడా నో చెప్తారా చెప్పండి .? ఒక్కసారి హిట్ కొట్టిన ఈ దర్శకులకు కథ ఎలా ఉన్నా సరే అపాయింట్మెంట్ అయితే ఉంటుంది.పైన చెప్పిన లిస్టులో ఉన్న అందరూ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా, అసోసియేట్ డైరెక్టర్స్ గా, కో డైరెక్టర్స్ గా పని చేసిన వారందరూ కూడా ప్రస్తుతం డైరెక్టర్స్ గా మారి సక్సెస్ఫుల్ దర్శకులుగా ప్రయాణం చేస్తున్నారు.

 Directors And Their God Fathers ,directors, Ram Gopal Varma, Vv Vinayak, Tollywo-TeluguStop.com

ఒక్క స్టార్ హీరో తో సినిమా పడింది అంటే చాలు ఇక యూత్ లో వారిపై క్రేజ్ వస్తుంది.ఆ క్రేజ్ కోసమే మంచి హీరోలతో సినిమాలు తీయాలని సదరు దర్శకులు భావిస్తుండడం విశేషం.

ఈటివల కాలంలో హీరో, హీరోయిన్ తో సంబంధం లేకుండా దర్శకుల పేరు చెప్పి మరి మార్కెట్ పెంచుకుంటున్నారు రోజులు.అలా యువ దర్శకులు తమ క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు.

నేటి రోజుల్లో యువత కూడా అలాగే ఉన్నారు హీరోతో పనిలేదు పోస్టర్ పై డైరెక్టర్ పేరు ఉంటే చాలు ఎలాంటి ఫేసు వాల్యూ లేకపోయినా సరే సినిమా కోసం క్యూ కడుతున్నారు.కానీ కొంతమంది మాత్రం ఒక సినిమా తీయకపోవడంతో ఎలాంటి అవకాశం దొరక్క స్క్రిప్ట్ రెడీ చేసుకుని నిర్మాతల చుట్టూ, హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

కృష్ణానగర్ వెళితే అలా వందల్లో యువ దర్శకులు వారికి ఒక అవకాశం అయినా దొరకపోతుందా అని ఎదురుచూస్తున్న వారు మనకు కనిపిస్తూ ఉంటారు.ఆది సినిమా డైరెక్ట్ చేయడంతో వివి వినాయక రేంజ్ ఈరోజు ఈ స్థాయి లో ఉన్నాడు కానీ ఒకప్పుడు అమ్మ దొంగ సినిమా ఫెమ్ అయిన సాగర్ కి వి వి వినాయక్ శిష్యుడు అనే విషయం చాలా మందికి తెలియదు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడంతో అతి తక్కువ సమయంలో స్టార్ డైరెక్టర్ గా మారాడు.

Telugu Anil Ravipudi, Boyapati Srinu, Directors, Krishna Vamshi, Ram Gopal Varma

ఇక రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్ లు కూడా తక్కువ కాలంలోనే మంచి అండదండ లభించడంతో గొప్ప డైరెక్టర్స్ గా మారిపోయారు.బోయపాటి శ్రీను సైతం ముత్యాల సుబ్బయ్య వంటి అగ్ర దర్శకుడు దగ్గర శిష్యరికం చేసినవారే.ఇక రాజమౌళి సంగతి మనందరికీ తెలిసిందే.

రాఘవేంద్రరావు శిష్యరికంలో రాటు తేలాడు రాజమౌళి.జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ తో తొలిసారిగా దర్శకుడిగా మారాడు.

గీత గోవిందం వంటి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు పరుశురాం.అయితే ఇతడు పూరీ జగన్నాథ్ శిష్యుడు కావడం విశేషం.

అతడికి పూరి అండదండలు ఉన్నాయి కాబట్టే గీత గోవిందం లాంటి సినిమా అవకాశం వచ్చింది.ఆ సినిమా హిట్ కావడంతో మహేష్ బాబుతో సర్కారీ వారి పాట సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ గా పరశురామ్ ఎదిగాడు.

Telugu Anil Ravipudi, Boyapati Srinu, Directors, Krishna Vamshi, Ram Gopal Varma

ఇక రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన మరొక దర్శకుడు అజయ్ భూపతి.ఆర్ఎక్స్ 100 సినిమా హిట్ అవ్వడంతో ఇతను రేంజ్ కూడా మరో రేంజ్ కి వెళ్ళింది.వర్మ తన శిష్యులను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు.అలాగే పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుధీర్ వర్మ సైతం స్వామి రారా సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత మజిలీ, నిన్ను కోరి వంటి సినిమాలు తీసి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు.ఇక అనిల్ రావిపూడి కూడా ఏం తక్కువ తినలేదు.తమిళ డైరెక్ట్ అయినా శివ దగ్గర మొదట అనిల్ రావిపూడి శిష్యరికం చేశాడు.ఆ తర్వాత పటాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబుతో సైతం సినిమా తీశారు.

ఇప్పుడు బాలకృష్ణ డైరెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఇలా ఎవరో ఒకరు అండగా ఉండి గాడ్ ఫాదర్ గా మారడం వల్లే మనం ఈ దర్శకుల పేర్లన్నీ కూడా ఈరోజు తెరమీద చూడగలుగుతున్నాం మరి ఏమాత్రం సహాయం దొరక్క కృష్ణ నగర్ వీధిలో తిరుగుతున్న వారు ఎంతోమంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube