Her Movie Review: హర్ రివ్యూ: క్రైమ్ థ్రిల్లింగ్ తో కనెక్ట్ చేసిన డైరెక్టర్?

డైరెక్టర్ శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్షన్లో రూపొందిన సినిమా హర్.( Her Movie ) నిజానికి డైరెక్టర్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 Director Sreedhar Ruhani Sharma Her Chapter 1 Movie Review And Rating-TeluguStop.com

ఈ సినిమాలో రుహాని శర్మ,( Ruhani Sharma ) అభిజ్ఞ,( Abhigna ) రవి వర్మ, లోహ్యా, కేశవ్, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, సంజయ్ స్వరూప్, బెనర్జీ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు పవన్ ఆర్ఆర్ అందించగా విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.

ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.పైగా ఈ సినిమా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది కాబట్టి చాలామంది ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అయితే ఈ సినిమా తాజాగా థియేటర్ లోకి రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.సిటీలో ఒక జంట హత్య జరగటంతో ఈ కేసును ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహాని శర్మ) విచారిస్తుంది.అప్పటికే కొన్ని కారణాల వల్ల ఆరు నెలలపాటు సస్పెండ్స్ అయిన అర్చన మళ్లీ తిరిగి తన విధుల్లోకి రావడంతో ఈ కేసు తనకు పెద్ద సవాల్ గా మారుతుంది.

ఇక అర్చన నేరస్తుడు కేశవ్ ను పట్టుకునే ఆపరేషన్ లో తను ప్రేమించిన వ్యక్తి శేషాద్రిని ( Seshadri ) కోల్పోతుంది.ఇక కేశవ కు సంబంధించిన కేసు ఎస్ ఐ ఏ చూస్తుంటుంది.

అసలు చనిపోయిన జంట ఎవరు.ఆ జంటకు కేశవకు ఉన్న సంబంధం ఏంటి.

వారిని ఎవరు చంపారు.చివరికి అర్చన ఈ కేసును గెలిపిస్తుందా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Abhijna, Banerjee, Chapter, Chapter Review, Review, Jeevan Kumar, Keshav,

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే.అర్చన ప్రసాద్( Archana Prasad ) పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుంది.ఈ పాత్రలో రుహానీ శర్మ అద్భుతంగా నటించింది.ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలలో అదరగొట్టింది.ఇక అభిజ్ఞ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ కూడా బాగానే నటించింది.ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా కొంతవరకు మెప్పించారు.

Telugu Abhijna, Banerjee, Chapter, Chapter Review, Review, Jeevan Kumar, Keshav,

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.ఈ సినిమాతో శ్రీధర్ ( Director Sridhar ) మొదటిసారిగా డైరెక్టర్ గా పరిచయమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా కొత్త డైరెక్టర్ అని ఫీలింగ్ రాలేదు.ప్రతి ఒక్క సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు.ఇక పవన్ అందించిన ఆర్ఆర్ బాగుంది.విష్ణు బేసి అందించిన సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ శ్రీధర్ కి మొదటి సినిమా అయినా కూడా అనుభవమున్న డైరెక్టర్గా పనిచేశాడు.కథను అద్భుతంగా రాసుకున్నాడు.

ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాను బాగా చూపించాడు.ఫస్టాఫ్ లో బాగా సస్పెన్స్ ని క్రియేట్ చేశాడు.

అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే సస్పెన్స్ ను చూపించాడు.

Telugu Abhijna, Banerjee, Chapter, Chapter Review, Review, Jeevan Kumar, Keshav,

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటుల నటన, కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్( Suspense Crime Thriller ) ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube