మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన డైరెక్టర్ రవిబాబు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkatreddy )ని డైరెక్టర్ రవిబాబు పరామర్శించారు.హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అల్లరి, నచ్చవులే, అనసూయ, అవును తదితర సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రవి బాబు( Director Ravi Babu ) కలిశారు.

 Director Ravi Babu Met Cinematography Minister Komatireddy Venkat Reddy,komatire-TeluguStop.com

ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు రవి బాబు.గత కొంత కాలంగా ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైద్యులు Thyomectomy ట్రీట్మెంట్ అందించారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆప్యాయంగా డైరెక్టర్ రవిబాబు కలవడం వీరి స్నేహాన్ని తెలియజేస్తుంది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో గెలవాలని రవిబాబు వీడియో బైట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కోమటిరెడ్డి అంటే పేదలను ఆదుకునే నాయకుడని, ప్రజా సమస్యలను ఆయన భుజాలపై మోసుకెళ్లే లీడర్ అని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube