ఏపీలో సొంత పార్టీలో విభేదాలు అంటే ఇన్ని రోజులు టీడీపీ మాత్రమే గుర్తుకు వచ్చేది.కానీ ఇప్పుడు తాజాగా వైసీపీ కూడా ఇదే బాటలో నడుస్తుంది.
ఎందుకంటే ఆ పార్టీలో కూడా ఒకరంటే ఒకరికి అస్సలు నచ్చట్లేదంట.ఇక మరీ ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆధిపత్య పోరు నడుస్తోందని తెలుస్తోంది.
ఇక తాజాగా మరోసారి రాజమండ్రి వేదికగా ఈ విభేదాలు బయటపడ్డాయి.ఇక ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారిన చెప్పారు.
ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని, కాబట్టి పార్టీ నుంచి అలాంటి వారిని దూరంగా పెడితేనే పార్టీలో అలజడి తగ్గుతుందని చెప్పారు.
ఇక ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ పనులు ఉంటున్నాయని వెల్లడించారు.తాను ప్రభుత్వానికి మచ్చ తీసుకు వచ్చే విధంగా వ్యతిరేక ధర్నాలు చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయిస్తే ఎంపీ భరత్ రామ్ అతనికి వత్తాసు పలకడం అంటే ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు.
ఇక పురుషోత్తమ పట్నంలో ఎంపీ రైతుల పేరు మీద పరిహారం అడుగుతూ అక్రమ వసూళ్లు చేపడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక ఎంపీ మార్గాని భరత్ కుమార్ జగన్‌కు వ్యతిరేకంగా ఉంటున్న వారితో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపించారు.సీబీఐ మాజీ జేడీని భరత్ కలిశారని, ఆయన్ను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది.
ఇద్దరూ కూడా పార్టీ పరమైన పదవుల్లో తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకోసమే ఇలాంటి పోరు నడుస్తోందని వెల్లడించారు.ఇక దీనిపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
మరి జగన్ వీరిమీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
.