"వైయస్సార్ నేతన్న నేస్తం" పథకం మూడో విడత లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

మూడో విడత వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ఇటీవల ఏపీ సీఎం జగన్ అమలు చేయడం తెలిసిందే.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి లబ్ధిదారులకు సీఎం జగన్ డబ్బులు వారి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.

 Cm Jagan Sensatational Comments Ysr Nethanna Nestham, Ys Jagan , Ysr Nethanna N-TeluguStop.com

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను చేసిన పాదయాత్రలో ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలు వినటం జరిగిందని తెలిపారు.దీంతో ఎన్నికల ప్రచారంలో అదేరీతిలో పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్కరికి అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటూ పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

దీనిలో భాగంగా వైఎస్సార్ నేతన్న నేస్తం మూడో దశ కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.సొంత మాఘం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాల 24 వేల రూపాయలు అందజేస్తున్నట్లు నేతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నట్లు తెలిపారు.

తన మూడేళ్ల పరిపాలన పూర్తికాకముందే రెండేళ్ల రెండు నెలల వ్యవధిలో వరసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు ఈరోజు విడుదల చేయడం జరిగిందని స్పష్టం చేశారు.పాదయాత్రల ఎన్నికల ప్రచారంలో చేనేతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు జగన్ స్పష్టం చేశారు.దాదాపు 80,032 నందు నేతన్నల ఖాతాలోకి 192.08 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube