ఆ సినిమా తర్వాత ప్రభాస్ కు అభిమానిగా మారా.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్( star hero prabhas ) క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అనే సంగతి తెలిసిందే.ప్రభాస్ కల్కి సినిమా( Kalki movie ) రిలీజ్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

 Shreyas Iyer Comments About Star Hero Prabhas Details Here Goes Viral In Social-TeluguStop.com

కల్కి సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.ఫ్యాన్స్ ను డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ ను నేను పెద్ద అభిమానినని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చారు.

బాహుబలి మూవీ చూసిన తర్వాత ప్రభాస్ కు ఫ్యాన్ అయిపోయానని శ్రేయస్ అయ్యర్ కామెంట్లు చేశారు.

అప్పటినుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ ను ఫాలో అవుతున్నానని ప్రభాస్ సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని ఆయన తెలిపారు.

కరోనా సమయంలో ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాలను చూసి ఎంజాయ్ చేశానని శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer )పేర్కొన్నారు.మిర్చి సినిమాలో ప్రభాస్ చాలా అందంగా కనిపించారని శ్రేయస్ అయ్యర్ వెల్లడించడం గమనార్హం.

రాజాసాబ్, కల్కి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Telugu Kalki, Shreyas Iyer, Shreyasiyer, Prabhas, Young Directors-Movie

శ్రేయస్ అయ్యర్ చేసిన కామెంట్ల గురించి ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు 1000 కోట్ల రూపాయల( 1000 crore rupees ) కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ ఇతర భాషల అభిమానులకు సైతం దగ్గరవుతున్నారు.

ప్రభాస్ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Telugu Kalki, Shreyas Iyer, Shreyasiyer, Prabhas, Young Directors-Movie

ప్రభాస్ యంగ్ డైరెక్టర్లకు( young directors ) ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.వయస్సు పెరుగుతున్నా ప్రభాస్ యంగ్ లుక్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.ప్రభాస్ కు జోడీగా ఒక్క ఛాన్స్ కోసం హీరోయిన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ రెమ్యునరేషన్ పరంగా కూడా ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నారు.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube