హమ్మయ్య నన్ను వదిలేసారు.. రేవ్ పార్టీ ఘటనపై నవదీప్ కామెంట్స్!

బెంగళూరు రేవ్ పార్టీకి( Rave Party ) సంబంధించిన పలు విషయాలు సంచలనంగా మారాయి.బెంగళూరులో ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున వ్యాపార వేత్తలతో పాటు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు(Cini  Celebrities) హాజరయ్యారంటూ వార్తలు వచ్చాయి.

 Navadeep Sensational Comments About Benguluru Rave Party , Benguluru, Rave Party-TeluguStop.com

ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారని పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలోనే నటి హేమ ( Hema ) పేరును పోలీసులు తెలియజేయడమే కాకుండా ఆమెకు నోటీసులు కూడా పంపించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ఈ పార్టీపై నటుడు నవదీప్ ( Navadeep ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, ఎక్కడ ఏ డ్రగ్ కేసులో విచారణ జరిగిన సినీ ఇండస్ట్రీ నుండి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి నవదీప్.ఆయన ప్రమేయం లేకుండా మీడియా వారు తన పేరును ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు.అలాగే ఎన్నోసార్లు ఈయన అధికారుల ముందుకు కూడా హాజరు అయ్యారు.

అయితే మొదటిసారి బెంగళూరుకు సంబంధించిన రేవ్ పార్టీలో భాగంగా ఈయన పేరును ప్రస్తావనకు తీసుకు రాకపోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఘటన గురించి నవదీప్ మాట్లాడుతూ.ఇన్నాళ్లకు మీడియా తనని వదిలి పెట్టిందంటూ సంతోషపడ్డారు.బెంగళూరుకు సంబంధించిన ఈ రేవ్ పార్టీలో నా పేరు లేకపోవడంతో చాలామంది నిరుత్సాహపడ్డారని తెలిపారు.

మరికొందరైతే ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించలేదంటూ కూడా ఆయనను అడిగినట్లు నవదీప్ తెలిపాడు.ఈసారి తనకు మంచి జరిగిందని, ఈ ఒక్కసారి మీడియా తనను వదిలేసింది అంటూ ఈ ఘటనపై ఆయన సంతోషంతో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube