పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే కల్కి ( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా సినిమాలలో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ తాను సంపాదించిన దానిలో పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు.
కరోనా సమయంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళం అందించారు అంతేకాకుండా తన తోటి నటీనటులకు సహాయం చేస్తూ ఉంటారు.
డైరెక్టర్ అసోసియేషన్ కి ఏకంగా 34 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా ఎన్నో సహాయ సహకారాలు చేసే ప్రభాస్ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఎంతో ఘనంగా ఆతిథ్యం ఇస్తారు.అలాగే షూటింగ్ లొకేషన్లోకి కూడా ఈయన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటారు.
అయితే తాజాగా మరోసారి ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నారు.
ప్రభాస్ అభిమాని మరణించారని వార్త తెలియడంతో ప్రభాస్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారనే వార్త తెలియడంతో ప్రభాస్ మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.కరీంనగర్ కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్( Ramesh ) ఈ మధ్యకాలంలో మరణించారు.ఈ వార్త తెలుసుకున్నటువంటి ప్రభాస్ వెంటనే తన పీఏకి చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఇలా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా ఆయన పేరిట కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇలా ప్రభాస్ అభిమాని కోసం చేసిన ఈ పని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.