మూడో పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్ మీరా వాసుదేవన్.. పెళ్లి వెనుక అసలు కారణాలివే?

తాజాగా హీరోయిన్ మీరా వాసుదేవన్‌( Meera Vasudevan ) పెళ్లి పీటలెక్కింది.ముచ్చటగా మూడవ సారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది.

 Actress Meera Vasudevan Got Married Third Time, Meera Vasudevan, Marriage, Third-TeluguStop.com

కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంతో కలిసి ఆమె ఏడడుగులు వేసింది.ఈ శుభవార్తను మీరా వాసుదేవన్ తన సోషల్‌ మీడియా వేదికగా కాస్త ఆలస్యంగా వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 21న కోయం బత్తూరులో ( Koyam Battur )పెళ్లయిందని, రిజిస్టర్‌ ప్రక్రియ ఈరోజు పూర్తయింది అంటూ శుక్రవారం రోజు పెళ్లి ఫోటోలు షేర్‌ చేసింది.

కాగా మీరా భర్త విపిన్‌ ( Vipin )కేరళ లోని పాలక్కడ్‌ ప్రాంతానికి చెందినవాడు.ఈయన ఒక సినిమాటో గ్రాఫర్‌.అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు.

విపిన్‌, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం.గత ఏడాది వీరు కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చారట.

అలా ఈ ఏడాది ఒక్కటయ్యారు.ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధు మిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగిందని రాసుకొచ్చింది మీరా.

ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా నటి మీరా మొదట సీరియల్స్( serials ) ద్వారా కెరిర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.గోల్‌మాల్‌ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది.అంజలి ఐ లవ్‌ యూ అనే చిత్రంలోనూ నటించింది.తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube