Protein Food : ప్రోటీన్ కోసం గుడ్డునే కాదు ఈ ఆహారాలు కూడా తీసుకోవచ్చు.. తెలుసా?

మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్( Protein ) ముందు వరుసలో ఉంటుంది.మన శరీరంలోని ప్రతి కణం ఏర్పడటానికి మరియు నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం.

 What Foods Can Be Taken For Protein Instead Of Egg-TeluguStop.com

ప్రోటీన్ శరీరానికి శక్తిని అందిస్తుంది.కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది.

ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.జీవక్రియను మెరుగుపరుస్తుంది.

కొవ్వు నిల్వ ను తగ్గిస్తుంది.వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.

బాడీని ఫిట్ గా తయారు చేస్తుంది.ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, మెదడు పనితీరును నిర్వహించడానికి కూడా ప్రోటీన్‌ బాధ్యత వ‌హిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రోటీన్ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.అందుకే నిత్యం ప్రోటీన్ ఫుడ్ ను( Protein Food ) తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే ప్రోటీన్ అన‌గానే ప్రతి ఒక్కరికి మొదట గుర్తుకు వచ్చేది గుడ్డు.( Egg ) చాలా మంది ప్రోటీన్ పొందడం కోసం ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు తింటుంటారు.

అయితే గుడ్డులోనే కాదు ఇప్పుడు చెప్పబోయే ఆహారాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

Telugu Black Gram, Green Gram, Tips, Latest, Milk, Mung Bean, Paneer, Protein-Te

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది పెసలు.ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో పెసలు ఒకటి.పెసలు( Mung Bean ) ద్వారా ప్రోటీన్ తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలను కూడా పొందవచ్చు.

అలాగే మినుములు( Black Gram ) ప్రోటీన్ రిచ్ ఫుడ్ గా చెప్పబడ్డాయి.మినుములను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.ముఖ్యంగా మినప సున్నుండలు తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.ప్రోటీన్ కొరత తలెత్తకుండా ఉంటుంది.

Telugu Black Gram, Green Gram, Tips, Latest, Milk, Mung Bean, Paneer, Protein-Te

అలాగే రోజుకు ఒక గ్లాసు పాలు( Milk ) తాగడం వల్ల పది గ్రాముల క్వాలిటీ ప్రోటీన్ ను మీరు పొందుతారు.పైగా పాలలో ప్రోటీన్ తో పాటు అనేక రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అండగా నిలబడతాయి.ప్రోటీన్ రిచ్ గా ఉండే ఆహారాల్లో వేపుడు శనగలు( Chickpeas ) ఒకటి.రోజుకో గొప్పడు వేపుడు శనగలు తీసుకుంటే 20 గ్రాముల ప్రోటీన్ పొందుతారు.ఇక ప్రోటీన్ కోసం పన్నీరుని కూడా తీసుకోవచ్చు.

పన్నీర్ లో ప్రోటీన్ తో పాటు మరెన్నో పోషకాలు నిండి ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube