తెలుగులో ప్రసారం అవ్వుతున్న జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.కొంతమంది జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించుకొని సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
అలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు.మొన్నటి వరకు బుల్లితెర సందడి చేసిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ( Young hero Anand Deverakonda ) ప్రధాన పాత్రలో నటిస్తున్న గం గం గణేశా సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఇందులో హీరో స్నేహితుడిగా కనిపిచంనున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇమ్మాన్యుయేల్( Emmanuel ) తన జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు.ఈ క్రమంలో తన తాత మరణం.
చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.ఈ సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.
అప్పుడే జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది.

అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయాడని చెప్పాడు.మా తాత అంటే నాకు చాలా ఇష్టం.కానీ నేను అప్పుడు వెళ్లిపోతే జబర్దస్త్ స్కిట్ డిస్టర్బ్ అవుతుంది.
అప్పుడు వెళ్లలేని పరిస్థితి.పక్కకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను.
ఆ తర్వాత కళ్లు తుడుచుకుని స్టేజి పైకి వచ్చి స్కిట్ చేశాము.ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది.
నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్ అన్నింటిలో అదే బెస్ట్.మా తాత మరణించాడనే బాధను మర్చిపోవడానికి బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో.
స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి.మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్.