స్టార్ మా తో ఎన్టీఆర్ గొడవలు కారణం ఇదే

సంచలనాల రియాల్టీ షో బిగ్ బాస్ చివరివారానికి చేరుకుంది.మొదటి రోజే తుఫానులా ప్రారంభమైన ఈ షో, మొదట్లో పూర్తిగా ఎన్టీఆర్ మీదే ఆధారపడి బండి లాకొచ్చింది.

 Clashes Between Ntr And Star Maa-TeluguStop.com

మెల్లిగా పుంజుకున్న బిగ్ బాస్, ఆ తర్వాత నెంబర్వన్ రియాల్టీ షోగా జరిగింది.స్టార్ మా ఛానెల్ ని వరుసగా కొన్ని వారాల పాటు నెంబర్ వన్ స్థానంలో నిలిపింది.

కానీ గత రెండు వారాలుగా బిగ్ బాస్ పీఆర్పీలో స్వల్పంగా తరుగుదల కనిపిస్తోంది.సగటు లెక్కల్లో తేడాలు వచ్చాయి.

రానా నిర్వహిస్తున్న నెంబర్ వన్ యారి టీఅర్పీ పెరిగిపోయింది.జెమినీ ఛానెల్ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

స్టార్ మా గత రెండు వారాలుగా రెండవ స్థానంతోనే సరిపెట్టుకుంటుందని

దీనికి కారణం ఎన్టీఆర్ కాదు.స్వయంగా స్టార్ మా యాజమాన్యం.

బిగ్ బాస్ ఎపిసోడ్లు రిపీట్ టెలికాస్ట్ ఎక్కువగా చేస్తున్నారు.దాంతో మొదటి టెలికాస్ట్ మీదే ఆధారపడి దాన్నే ప్రేక్షకులంతా చూడటం లేదు.

వీలుని బట్టి రెండవ టెలికాస్ట్ లేదా మూడవ టెలికాస్ట్ చూస్తున్నారు.దాంతో సగటు టీఅర్పి తగ్గిపోతోంది.

అంతమాత్రమే కాదు, రాత్రి పూర్తయిన ఎపిసోడ్, తెల్లారి 6 గంటల సమయానికే హాట్ స్టార్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.దాంతో టీవీలో చూడాల్సిన జనాలు తెల్లారి తక్కువ యాడ్స్ చూస్తూ గంటన్నర పట్టే ప్రోగ్రాంని కేవలం గంటలో ముగిస్తున్నారు.

అదీకాక బిగ్‌బాస్ షో ఎపిసోడ్లు పైరసీ రూపంలో యూట్యూబ్లో వెంటవెంటనే దర్శనమిస్తున్నాయి ‌.ఆ వీడియోలకు లక్షల్లో వీక్షణలు ఉంటున్నాయి.అందుకే సగటు పడిపోతోంది.ఈ సమస్యలన్నీ ఎన్టీఆర్ స్టార్ మా దృష్టికి తీసుకు వెళ్లారట.వీటికి పరిష్కార మార్గాలు త్వరగా ఆలోచించలేకపోతే తాను తదుపరి సీజన్ చేయబోనని ముక్కుసూటిగా చెప్పేశాడట యంగ్ టైగర్

మరి ఛానెల్ యాజమాన్యం ఎన్టీఆర్ లేవనెత్తిన సమస్యలపై తక్షణమే ఆలోచిస్తారా, పరిష్కారం వెతికే వెంటనే అమలు పరుస్తారా లేదా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube