ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.దాదాపు 14 దేశాలతో సరిహద్దు వివాదాలు పెట్టుకున్న చైనా ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలోనూ అలాగే భారత్ సరిహద్దులలో కావాలని వివాదాలు రాజేస్తుంది.
దీనిపై కన్నెర్రజేసిన పెద్దన్న (అమెరికా) ఆసియా నాటోకు రంగం సంసిద్ధం చేస్తుంది.ఈ ప్రక్రియ కార్యాచరణ రూపం దాల్చే లోపు సమయం వృధా చేయకుండా చైనా వ్యతిరేక ఆసియా దేశాలన్ని ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అలాగే అమెరికా ఎన్నికల తర్వాత చైనా యుద్ధం చేయడానికి సిద్ధమౌతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ చైనా వ్యతిరేక దేశాలన్నీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం కోసం అమెరికాని ఆశ్రయిస్తున్నాయి.దీనితో తమ సహాయం కోసం వచ్చిన దేశాలకి 1,2 ఫ్రీగా ఇస్తున్న అమెరికా మిగతా వాటికి మాత్రం గట్టిగా డబ్బులు వసూలు చేస్తుంది.
ఇదంతా చూస్తున్న చైనా తాము సృష్టించిన కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అమెరికా విజయవంతంగా తమ వ్యతిరేక దేశాలకు ఆయుధాలు అమ్మి అధిగమిస్తుండడంతో అస్సలు తట్టుకోలేకపోతోంది.అందుకే పనీపాటా లేకుండా రోజుకొకసారి మీడియా ముందు అమెరికాను దూషిస్తుంది.
అమెరికా వారికి ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.ఆసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధవాతావరణం అమెరికా ఎన్నికలపై ఆధారపడి ఉంది.
మరి ఆ ఎన్నికల ఫలితాలు ఏ తీర్పు ఇవ్వబోతున్నాయో తెలుసుకోవడానికి మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంది.