హర్యానాలో 50 కోట్ల ప్రజాధనం నీళ్ళ పాలు కాబోతున్నది.ఇంత డబ్బు నీళ్ళ పాలు చేయడానికి నీళ్ళు ఉన్నాయా అంటే లేవు.
మరి నీళ్ళ పాలు చేయడం ఏమిటి? మన పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది.గంగా, యమునా, సరస్వతి అని అనడం మనకు తెలుసు.
గంగ, యమున మనకు కనబడుతున్నాయి.కాని సరస్వతి కనబడదు.
దీన్ని అంతర్వాహిని అంటారు.అంటే భూమి అడుగున ప్రవహిస్తుంది అంటారు.
ఈ నదిని బయటకు తీయడం సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు.హర్యానాలో ఉన్నది మతపరమైన ఆలోచనలు ఉన్న భాజపా ప్రభుత్వమే కాబట్టి ఈ నదిని బయటకు తీయడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.7 అడుగుల లోతున సరస్వతి నది నీరు కనబడిందని పరిశోధకులు చెప్పారు.సరస్వతి నది కట్టు కథ కాదని, అది నిజంగానే ఉందని చాలా ఏళ్ళ కిందటే ఇండియా టుడే కథనం ప్రచురించింది.