ఉక్కు వలయంలో దేశ రాజధాని

దేశ రాజధాని ధిల్లీ ఉక్కు వలయంలో ఉంది.అంటే నగరమంతా పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా దళాలు మోహరించాయి.ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఎంతో అప్రమత్తమైంది.6 వేల మందికి పైగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించారు.లష్కరే తోయిబా ఉగ్రవాదులు మార్కెట్ల మీద, ప్రధాన కూడళ్ళలో దాడులు చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి.దీంతో భూమి నుంచి ఆకాశం వరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.

 Tight Security In Delhi-TeluguStop.com

ఎర్ర కోటకు 5 కిలోమీటర్ల పరిధిలో చీమ కూడా దూరడానికి అవకాశం లేదు.ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక భద్రత కల్పించారు.

కమాండోల దగ్గర పూర్తీ ఆటోమాటిక్ ఆయుధాలు ఉన్నాయి.అత్యాధునిక కమ్యునికేషన్ పరికరాలు ఉన్నాయి.

కమాండోలు ఉక్కు మనుషుల్లా తయారయ్యారు.వీరంతా ఎటువంటి దాడులు జరిగినా తిప్పి కొట్టగల సామర్ధ్యం ఉన్న వారు.500 పైగా సీసీ టీవీలు ఏర్పాటు చేసారు.కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు.

టవర్ల మీద అత్యాధునిక కెమెరాలు అమర్చారు.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంది.

మొత్తం మీద గతంలో కంటే అప్రమత్తంగా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube