వీడియో: స్కియింగ్ చేద్దామని వెళ్తే క్రూరమైన ఎలుగుబంటి వెంబడించింది.. ఎలా తప్పించుకున్నాడో చూస్తే..!

తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఒక వ్యక్తి మంచు పర్వతాల్లో స్నోబోర్డింగ్ లేదా స్కియింగ్ చేద్దామని వెళ్ళాడు.అయితే అతడికి ఒక క్రూరమైన అడవి ఎలుగు బంటి ఎదురయ్యింది.

 Chased By A Ferocious Bear When Going To Take Out Skiing , Viral Video , Scating-TeluguStop.com

అంతేకాదు అది అతడి వెంట పడింది.ఎలుగు బంటి తనను వెంబడించిందని తెలిసి అతడికి గుండె ఆగినంత పని అయ్యింది.

ఆ వ్యక్తి పేరు డీజే అలోక్ కాగా అతను ఒక వెకేషన్ ప్లాన్ చేసి ఫ్రాన్స్ లోని మంచు పర్వతాలు వద్దకు వెళ్ళాడు.ఆ మంచు పర్వతాల్లో ఎంచక్కా అతడు స్కియింగ్ బోర్డ్ పై అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.

అయితే ఈ నేపథ్యంలోనే ఒక భారీ ఎలుగుబంటి అతడిని చూసి వెంట పడింది.కానీ ఈ విషయాన్ని అతడు గ్రహించలేక పోయాడు.

తన స్కియింగ్ వీడియోలను తర్వాత వీక్షించినప్పుడు తన వెనుక ఒక ఎలుగు బంటి వెంట పడిందని తెలుసుకున్న అతడు ఇప్పుడు షాక్ అవుతున్నాడు.అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో అలోక్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టు మనం గమనించ వచ్చు.ఆ తర్వాత తన కెమెరా సెట్ చేసుకొని స్కియింగ్ బోర్డు పైఎక్కి ఫాస్ట్ గా మంచుపై జారుతూ ఉండటం కూడా చూడొచ్చు.ఇంతలోనే చెట్ల పొదల్లో నుంచి ఒక భారీ ఎలుగు బంటి బయటికి వచ్చింది.అది అలోక్ ను చూసి పరిగెత్తడం ప్రారంభించింది.అయితే అలా వెంబడిస్తూ ఆ ఎలుగుబంటి ఒక చోట కింద పడింది.తర్వాత అలోక్ ను వెంబడించడం మానేసింది.

ఈ విషయాన్ని అలోక్ గమనించ లేదు.అందుకే అతడు భయపడకుండా అలానే ముందుకు సాగిపోయాడు.

తనకు తెలియ కుండానే అతడు ఎలుగు బంటి నుంచి తప్పించు కున్నాడు.

అయితే ఇటీవల తాను రికార్డ్ చేసిన వీడియోలన్నీ చెక్ చేస్తుంటే తన వెనుకవైపు ఓ ఎలుగు బంటి ఉందని అతడు తెలుసుకున్నాడు.

ఆ తర్వాత ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు.ఇప్పుడు అది వైరల్ అవుతుంది.

దీన్ని వీక్షించిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మీరు చాలా లక్కీ అని కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube