వీడియో: స్కియింగ్ చేద్దామని వెళ్తే క్రూరమైన ఎలుగుబంటి వెంబడించింది.. ఎలా తప్పించుకున్నాడో చూస్తే..!
TeluguStop.com
తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఒక వ్యక్తి మంచు పర్వతాల్లో స్నోబోర్డింగ్ లేదా స్కియింగ్ చేద్దామని వెళ్ళాడు.
అయితే అతడికి ఒక క్రూరమైన అడవి ఎలుగు బంటి ఎదురయ్యింది.అంతేకాదు అది అతడి వెంట పడింది.
ఎలుగు బంటి తనను వెంబడించిందని తెలిసి అతడికి గుండె ఆగినంత పని అయ్యింది.
ఆ వ్యక్తి పేరు డీజే అలోక్ కాగా అతను ఒక వెకేషన్ ప్లాన్ చేసి ఫ్రాన్స్ లోని మంచు పర్వతాలు వద్దకు వెళ్ళాడు.
ఆ మంచు పర్వతాల్లో ఎంచక్కా అతడు స్కియింగ్ బోర్డ్ పై అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.
అయితే ఈ నేపథ్యంలోనే ఒక భారీ ఎలుగుబంటి అతడిని చూసి వెంట పడింది.
కానీ ఈ విషయాన్ని అతడు గ్రహించలేక పోయాడు.తన స్కియింగ్ వీడియోలను తర్వాత వీక్షించినప్పుడు తన వెనుక ఒక ఎలుగు బంటి వెంట పడిందని తెలుసుకున్న అతడు ఇప్పుడు షాక్ అవుతున్నాడు.
అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.