చంద్రబాబు సంచలన శపథం.. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

 Chandrababu Sensatational Challenge In Ap Assembly Details, Andhra Pradesh, Asee-TeluguStop.com

మళ్లీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత.అసెంబ్లీలో అడుగు పెడతానని పేర్కొన్నారు.

వైసీపీ నేతలు కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు.కుప్పం గురించి తనని చులకన…చేసిన వ్యక్తి గతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.

కానీ ఇంట్లో ఉన్న భార్య గురించి తప్పుగా మాట్లాడటం జరిగిందని.అందువల్లే సభ నుంచి వెళ్లి పోతున్నట్లు పేర్కొన్నారు.

మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేసి.తీవ్ర ఆగ్రహంతో అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారు.అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు.ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

 అసెంబ్లీలో మాత్రమే కాక అంతకుముందు టీడీపీ ఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు కంటతడి పెట్టినట్లు సమాచారం.ఈ క్రమంలో అసెంబ్లీలో… ఇంట్లో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటంతో భావోద్వేగానికి గురై తన నిర్ణయాన్ని వెల్లడించి సభ్యులందరికీ నమస్కరిస్తూ సభ నుండి వెళ్లిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube